ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా సోకిన ప్రతి పది మంది డయాబెటిస్ పేషంట్లలో..

ABN, First Publish Date - 2020-06-01T08:14:39+05:30

కరోనా సోకిన ప్రతి పది మంది డయాబెటిస్ పేషంట్లలో ఒకరు ఆసుపత్రిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పారిస్: కరోనా సోకిన ప్రతి పది మంది డయాబెటిస్ పేషంట్లలో ఒకరు ఆసుపత్రిలో చేరిన వారం రోజుల్లోనే మరణిస్తున్నట్టు కొత్త అధ్యయనం చెబుతోంది. మరోపక్క ప్రతి ఐదుగురు పేషంట్లలో ఒకరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్టు తేలింది. డయాబెటిస్‌ ఉన్న వారు కొవిడ్-19 బారిన పడితే ఎక్కువ ప్రమాదానికి గురవుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫ్రాన్స్‌లో మార్చి 10 నుంచి 31 మధ్య 53 ఆసుపత్రుల్లో 1300కు పైగా కరోనా పేషంట్లపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో 89 శాతానికి పైగా పేషంట్లు టైప్ 2 డయాబెటిస్‌తో.. 3 శాతం మంది టైప్ 1 డయాబెటిస్‌తో.. తదితరులు మిగతా వ్యాధులతో బాధపడుతున్నట్టు గుర్తించారు. పేషంట్లలో ఎక్కువ మగవారే ఉన్నారని.. వారి వయసు కూడా కనీసం 70 సంవత్సరాలుగా ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు. తమ పరిశోధనలో ఏడో రోజున 29 శాతం పేషంట్లు అయితే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని లేదంటే ప్రాణాలు కోల్పోతున్నారని పరిశోధకులు పేర్కొన్నారు. పది మందిలో ఒకరు చనిపోతుండగా.. ఐదుగురిలో ఒకరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్టు గుర్తించామన్నారు. మరోపక్క 18 శాతం మంది కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారని తెలిపారు. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారే వారం రోజుల్లో ఎక్కువగా మరణిస్తున్నట్టు అధ్యయనంలో తెలుసుకున్నామన్నారు. డయాబెటిస్ ఉన్నా లేకపోయినా ఊబకాయంతో బాధపడుతున్న వారు కూడా ఎక్కువ ప్రమాదానికి గురవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. కాగా.. గతంలో వచ్చిన వైరస్‌ల సమయంలో కూడా డయాబెటిస్‌తో బాధపడుతున్న వారే ఎక్కువగా మరణించినట్టు డేటా చెబుతోంది.

Updated Date - 2020-06-01T08:14:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising