ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరోసారి ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించిన ఒబామా..!

ABN, First Publish Date - 2020-05-18T00:01:25+05:30

కరోనా వైరస్.. అమెరికాలో విజృంభిస్తున్న వేళ.. అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఓ కాలేజీకి సంబంధించి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కరోనా వైరస్.. అమెరికాలో విజృంభిస్తున్న వేళ.. అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఓ కాలేజీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి ట్రంప్ సర్కార్ తీసుకున్న చర్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే అమెరికాలో వేలాది మంది మృత్యువాతపడుతున్నారని ఆరోపించారు. ‘ఇక్కడి నాయకులు.. కనీసం పని చేస్తున్నట్లు కూడా నటించడం లేదని’ టంప్‌ను ఉద్దేశిస్తూ విమర్శించారు. అంతేకాకుండా నల్లజాతీయుల పట్ల చూపిస్తున్న జాతివివక్షను కూడా ఒబామా ప్రస్తావించారు. కాగా.. అమెరికాలో కరోనా ప్రబలిన తర్వాత.. ట్రంప్‌ను ఒబామా విమర్శించడం ఇది రెండోసారి. ఇదిలా ఉంటే.. అధికారం నుంచి వైదొలిగిన తర్వాత ఒబామా సాధారణ జీవితం గడుపుతున్నారు. మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు కూడా చాలా తక్కువే. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ట్రంప్‌ను ఒబామా విమర్శించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 


Updated Date - 2020-05-18T00:01:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising