టూరిస్ట్ వీసాల జారీని ప్రారంభించిన ఒమన్!
ABN, First Publish Date - 2020-12-01T13:55:33+05:30
గల్ఫ్ దేశం ఒమన్ మళ్లీ టూరిస్ట్ వీసాల జారీని ప్రారంభించింది. కొవిడ్-19పై ఏర్పాటైన సుప్రీం కమిటీ సోమవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
మస్కట్: గల్ఫ్ దేశం ఒమన్ మళ్లీ టూరిస్ట్ వీసాల జారీని ప్రారంభించింది. కొవిడ్-19పై ఏర్పాటైన సుప్రీం కమిటీ సోమవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అయితే, హోటళ్లు, టూరిజం కంపెనీల ద్వారా వచ్చే సందర్శకులకు మాత్రమే టూరిస్ట్ వీసాలు ఇవ్వాలని సుప్రీం కమిటీ నిర్ణయించింది. కాగా, కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో మార్చిలో పర్యాటక వీసాల జారీని ఒమన్ నిలిపివేసింది. అయితే, జూన్‌లో టూరిస్ట్ వీసాల గడువును మార్చి 2021 వరకు పొడిగిస్తూ ఒమన్ నిర్ణయం తీసుకుంది. అదికూడా మార్చి 1, 2020 నుంచి ఆగస్టు 31, 2020 వరకు గడువు గల వీసాదారులకు ఈ పొడిగింపును వర్తింప చేసింది. ఇక అక్టోబర్ 1 నుంచి ఒమన్ అంతర్జాతీయ విమానాల రాకపోకలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కొవిడ్ వల్ల దేశవ్యాప్తంగా మార్చి 29న మూతపడ్డ విమానశ్రయాలు ఆరు నెలల తర్వాత అక్టోబర్‌లో తెరచుకున్నాయి.
Updated Date - 2020-12-01T13:55:33+05:30 IST