ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్టోబర్ 1 నుంచి ఒమన్ అంతర్జాతీయ విమాన సర్వీసులు..

ABN, First Publish Date - 2020-09-25T15:35:37+05:30

అక్టోబర్ 1 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభిస్తున్నట్లు గురువారం ఒమన్ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మస్కట్: అక్టోబర్ 1 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభిస్తున్నట్లు గురువారం ఒమన్ ప్రకటించింది. కరోనావైరస్ నుండి దేశాన్ని, విమానయాన సిబ్బందిని రక్షించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఒమన్ విమానయాన శాఖ పేర్కొంది. అలాగే దేశ రాజధాని మస్కట్, సలాహ్ నగరం మధ్య దేశీయ విమానాలను కూడా అదే రోజు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. వాలిడ్ వీసాలు ఉన్న నివాసితులకు ఒమన్ తిరిగి రావడానికి విదేశాంగ శాఖ అనుమతి అవసరం లేదని అధికారులు తెలిపారు.


చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ వీసాలు కలిగి ఉన్న ప్రవాసులు అక్టోబర్ 1 నుండి మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండానే సుల్తానేట్‌కు తిరిగి రావచ్చని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ షేక్ ఖలీఫా బిన్ అలీ అల్ హర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఒమన్ ఎయిర్ అధికారులు మాట్లాడుతూ ప్రయాణికులకు పూర్తి రక్షణతో సర్వీసులు నడుపుతామని వెల్లడించారు. ప్రయాణికులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. కాగా, మహమ్మారి కొవిడ్ వ్యాప్తి నియంత్రణ నేపథ్యంలో ఆరు నెలలుగా ఒమన్ అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే.   

Updated Date - 2020-09-25T15:35:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising