ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫైజర్ టీకాకు ఒమన్ ఆమోదం..!

ABN, First Publish Date - 2020-12-17T13:26:15+05:30

జీసీసీ(గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాలైన బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్‌‌ను ఆమోదించగా.. తాజాగా ఈ జాబితాలో మరో దేశం చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మస్కట్: జీసీసీ(గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాలైన బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్‌‌ను ఆమోదించగా.. తాజాగా ఈ జాబితాలో మరో దేశం చేరింది. ఒమన్ కూడా ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలో ఫైజర్ వ్యాక్సిన్ దిగుమతి, అత్యవసర వినియోగానికి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఫార్మసీ అండ్ డ్రగ్ కంట్రోల్.. ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లైసెన్స్ జారీ చేసింది. అలాగే 16 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే టీకా ఇవ్వాలని సూచించింది. అంతేగాక వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దా అనే చాయిస్ కూడా ప్రజలకే ఇవ్వాలని పేర్కొంది. ఈ సందర్భంగా వర్చువల్ సమావేశంలో మాట్లాడిన ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్ సయీది ఈ నెల చివరి వారం వరకు ఒమన్‌లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.


 ఫ్రంట్ లైన్ మెడికల్ స్టాఫ్, బేసిక్ సర్వీస్ ప్రొవైడర్స్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, రోగనిరోధ శక్తి తక్కువగా ఉన్నవారు, 65 ఏళ్లకు పైబడిన వృద్ధులు, ఉబకాయస్థులు, ఇంటెన్సివ్ కేర్‌లోని ఆరోగ్య కార్యకర్తలు, కొవిడ్ వార్డులలో పనిచేసే కార్మికులకు మొదట వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. అలాగే అందరికీ పూర్తి ఉచితంగా టీకా అందిస్తామన్నారు. ఇక కరోనా వ్యాక్సిన్ పట్ల సమాజ వైఖరి, ఆమోదయోగ్యత గురించి తెలుసుకోవడానికి ఒమన్ ఒక సర్వే చేపట్టింది. ఈ సర్వే ప్రజలలో అవగాహనను కలిగిస్తుందని, తద్వారా టీకా గురించి అపోహను తొలగించడానికి ప్రయత్నిస్తుందని మంత్రి తెలిపారు.   

Updated Date - 2020-12-17T13:26:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising