ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒమన్‌తో ‘ఎయిర్ బబుల్’ ఒప్పందం కుదుర్చుకున్న భారత్!

ABN, First Publish Date - 2020-10-02T04:52:22+05:30

భారత ప్రభుత్వంతో మరో దేశం ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. భారత్‌తో ఒమన్ దేశం ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకుందని పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఓ ప్రకటనలో తె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వంతో మరో దేశం ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. భారత్‌తో ఒమన్ దేశం ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకుందని పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఓ ప్రకటనలో తెలిపారు. ఇరు దేశాల మధ్య రెండు దేశాలకు చెందిన విమానాలు రాకపోకలు సాగించేందుకు మార్గం సుగమం అయిందని ఆయన స్పష్టం చేశారు. కాగా.. కొవిడ్ విలయం ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభమైన తొలినాళ్లలో.. ప్రపంచం లాక్‌డౌన్ అయింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కూడా లాక్‌డౌన్‌ను అమలు చేసింది. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. అయితే విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడం కోసం ‘వందే భారత్ మిషన్’ను ప్రారంభించింది. ఇదే సమయంలో కొన్ని దేశాలతో ‘ఎయిర్ బబుల్’ ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం అమెరికా, కెనడా, కెన్యా, భూటాన్‌ దేశాలతో ‘ఎయిర్ బబుల్’ ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా ఒమన్‌తో కూడా ఈ ఒప్పందం చేసుకున్నట్లు హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ‘ఎయిర్ బబుల్’ ఒప్పందం ద్వారా ఇరు దేశాల ప్రయాణికులు.. రెండు దేశాల మధ్య ప్రయాణించవచ్చు. ఇదిలా ఉంటే.. అన్‌లాక్ 5.0లో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీస్‌లపై ఈ నెల చివరి వరకు నిషేధం విధించిన విషయం తెలిసిందే. 


Updated Date - 2020-10-02T04:52:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising