ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోమవారం నుంచి అమెరికన్లకు వ్యాక్సినేషన్..!

ABN, First Publish Date - 2020-12-13T13:58:15+05:30

ఫైజర్, బెయోఎన్‌టెక్ సంయుక్తంగా రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి ఎఫ్‌డీఏ( ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ) అనుమతి ఇవ్వడంతో అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు వ్యాక్సినేషన్‌కు చర్యలు చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ఫైజర్, బెయోఎన్‌టెక్ సంయుక్తంగా రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి ఎఫ్‌డీఏ( ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ) అనుమతి ఇవ్వడంతో అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు వ్యాక్సినేషన్‌కు చర్యలు చేపట్టారు. సోమవారం నుంచి ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు టీకా పంపిణీ కార్యక్రమం ఇంచార్జి జనరల్ గుస్ పెర్నా శనివారం వెల్లడించారు. గుస్ పెర్నా విలేకరులతో మాట్లాడుతూ మొదటి డోసు టీకా ఆదివారం షిప్పింగ్ చేయబడుతుందని, సోమవారం ఉదయం నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని చెప్పారు. "మేము 100 శాతం అనుకున్న సమయానికి అమెరికన్లకు వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభిస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. సోమవారం దేశవ్యాప్తంగా సుమారు 145 ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ మొదలవుతుంది. మరో 425 ప్రాంతాల్లో మంగళవారం అందిస్తాం. చివరగా 66 ప్రాంతాల్లో బుధవారం టీకా ఇవ్వడంతో తొలి దశ వ్యాక్సినేషన్ పూర్తవుతుంది." అని పెర్నా అన్నారు. 


మొదటి దశలో మూడు మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇక ఫెడరల్ హెల్త్ అధికారుల సిఫారసు మేరకు మొదట టీకా.. హెల్త్ కేర్ వర్కర్స్, నర్సింగ్ హోమ్ రెసిడెంట్స్‌కు ఇవ్వాలి. కానీ, తొలుత వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలనే తుది నిర్ణయం రాష్ట్రాలకే వదిలివేయబడిందని పెర్నా పేర్కొన్నారు. కాగా, ఫైజర్ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆరో దేశంగా అమెరికా నిలిచింది. యూఎస్ కంటే ముందు బ్రిటన్, బహ్రెయిన్, కెనడా, సౌదీ అరేబియా, మెక్సికో ఈ టీకాను అత్యవసర వినియోగానికి ఆమోదించాయి. ఇక ఫైజర్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తుందని తేలిన సంగతి తెలిసిందే.      

Updated Date - 2020-12-13T13:58:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising