ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నర్సింగ్ హో‌మ్‌లకు 4.8 బిలియన్ డాలర్లను కేటాయించిన అమెరికా ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-05-28T01:36:15+05:30

ఫెడరల్ ఫండింగ్ కింద అమెరికా వ్యాప్తంగా ఉన్న నర్సింగ్ హోమ్‌లు 4.8 బిలియన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: ఫెడరల్ ఫండింగ్ కింద అమెరికా వ్యాప్తంగా ఉన్న నర్సింగ్ హోమ్‌లు 4.8 బిలియన్ డాలర్లు అందుకోనున్నాయి. కొవిడ్-19 నుంచి పేషంట్లను కాపాడేందుకు నర్సింగ్ హోమ్‌లు కీలక పాత్ర పోషించాయి. తాజాగా ప్రభుత్వం కేటాయించిన నిధులు.. హెల్త్ కేర్ సిస్టమ్ మరింత అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడనున్నాయి. కాగా.. 4.8 బిలియన్ డాలర్లలో అత్యధికంగా 394 మిలియన్ డాలర్లు(రూ. 2,985 కోట్లు) ఒక్క న్యూయార్క్ రాష్ట్రానికే కేటాయించినట్టు సెనేటర్లు చార్లెస్ స్కూమర్, కిర్‌స్టెన్ గిల్లిబ్రాండ్ మంగళవారం వెల్లడించారు. న్యూయార్క్‌ కరోనాకు కేంద్రంగా మారడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ హోమ్‌లు రేయింబవళ్లు పేషంట్ల ప్రాణాలు కాపాడేందుకు పనిచేశాయన్నారు. తాజాగా విడుదల చేసిన నిధులు న్యూయార్క్ సీనియర్ హెల్త్ కేర్ సిస్టమ్‌‌‌కు ఎంతో అవసరమని సెనేటర్లు చెప్పారు. న్యూయార్క్‌కు కేటాయించిన నిధులు కనీసం 831 నర్సింగ్ హోమ్‌లు పంచుకోనున్నాయి. వివిధ కేటగిరీల కింద డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ రిసౌర్సెస్ ఈ నిధులను పంచనుంది. ప్రతి నర్సింగ్ హోమ్‌కు 50 వేల డాలర్ల(రూ. 37 లక్షల 88 వేలు)తో పాటు.. బెడ్‌కు 2500 డాలర్లు(రూ. లక్ష 89 వేలు) తప్పకుండా వస్తాయి. అయితే కనీసం ఆరు బెడ్స్‌తో ఉన్న నర్సింగ్ హోమ్‌లు మాత్రమే ఈ నిధులు పొందేందుకు అర్హత కలిగి ఉంటాయి. హెల్త్ కేర్ సిస్టమ్‌కు మరిన్ని నిధులు వచ్చేలా తాను సెనేట్‌లో పోరాడుతానని సెనేటర్ గిల్లిబ్రాండ్ అన్నారు.

Updated Date - 2020-05-28T01:36:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising