ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాకి దిగుతాం: ఏపీ ఎన్నారైలు

ABN, First Publish Date - 2020-10-18T02:06:42+05:30

కరోనా ఉధృతి తగ్గిన వెంటనే వైసీపీ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని ఆస్ట్రేలియాలోని ఏపీ ఎన్నారైలు స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఏపీ అ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కరోనా ఉధృతి తగ్గిన వెంటనే వైసీపీ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని ఆస్ట్రేలియాలోని ఏపీ ఎన్నారైలు స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఏపీ అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వైసీపీ నేతలు అక్రమ సంపాదనపైనే దృష్టిపెట్టి, ప్రజలను పట్టించుకోవాడం లేదని ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. తెలుగుదేశం నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావుతో సుమారు 100 మంది ఎన్నారైలు శనివారం రోజు జూమ్ కాల్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి టీడీపీ నేత శ్రీనివాస రావును అడిగి తెలుసుకున్నారు. 






ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల గురించి మాజీ ఎమ్మెల్యే వారికి వివరించారు. కాగా.. ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాలను వైసీపీ నేతలు కూల్చడం పట్ల ఎన్నారైలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేష్‌పై వైసీపీ నేతలు వాడుతున్న భాషపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా విజృంభణ తగ్గగానే వైసీపీ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి దిగుతామన్నారు. ప్రభుత్వ పెద్దల అవినీతి గురించి ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి కృషి చేస్తామన్నారు. 

Updated Date - 2020-10-18T02:06:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising