ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటు హక్కు వినియోగించుకున్న పౌరులకు ఎన్నారై టీఆర్ఎస్ కృతఙ్ఞతలు

ABN, First Publish Date - 2020-12-02T07:15:56+05:30

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పౌరులందరికీ ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం కృతఙ్ఞతలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పౌరులందరికీ ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం కృతఙ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు ముఖ్యమైన ఆయుధమని.. కానీ హైదరాబాద్ వంటి అత్యధికంగా చదువుకున్న వారు ఉండే నగరంలో తక్కువ ఓటింగ్ శాతం జరగడం బాధాకరమని ఆయన అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా పనిచేసిన స్థానికులకు, ఎన్నారై టీఆర్ఎస్ సభ్యులకు, మిత్రులకు ప్రత్యేక ధన్యావాదాలు తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం, సోషల్ మీడియా బాధ్యులు వై.సతీష్ రెడ్డి, క్రిశాంక్, జగన్‌ ఎప్పటికప్పుడు అందరినీ సమన్వయ పరిచి మరోసారి టీఆర్ఎస్ పార్టీ సోషల్‌ మీడియా సత్తాను చాటి చెప్పారని అనిల్ కూర్మాచలం అన్నారు. డిసెంబర్ నాలుగో తేదీన వెలువడే ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక డివిజన్లు గెలుచుకొని బల్దియాలో గులాబీ జెండా ఎగురుతుందనే విశ్వాసం ఉందని అనిల్ కూర్మాచలం అభిప్రాయపడ్డారు.

Updated Date - 2020-12-02T07:15:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising