ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీడియో: భారత్ రావొద్దు.. క్వారంటైన్‌లో ఉన్న తెలుగు వాసి సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-05-12T04:19:02+05:30

విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసులను భారత ప్రభుత్వం వందే భారత్ మిషన్ పేరిట స్వదేశానికి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 6 వేల మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో చాలా మంది తెలుగు వారు కూడా ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసులను భారత ప్రభుత్వం వందే భారత్ మిషన్ పేరిట స్వదేశానికి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 6 వేల మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. వీరిలో చాలా మంది తెలుగు వారు కూడా ఉన్నారు. కువైత్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న తెలుగు వాసులు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో బస చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కువైత్‌లో ఉన్న తెలుగు వారు కంగారు పడి హైదరాబాద్‌కు రావద్దంటూ నరేష్ బాబు అనే తెలుగు ఎన్నారై సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు బాగా ఉన్నాయనుకున్న వారు మాత్రమే హైదరాబాద్‌కు రమ్మంటూ ఆయన సలహా ఇస్తున్నారు. తాను, తనతో పాటు వచ్చిన వారి నుంచి అధికారులు 15 వేలు తీసుకున్నారని.. అదేంటంటే గాంధీ ఆసుపత్రికి వెళ్తారా అని ఎదురు ప్రశ్నిస్తున్నారని నరేష్ బాబు వాపోయారు. హోటల్‌లో సరైన సదుపాయాలు లేకపోయినప్పటికి.. వేలకు వేలు తీసుకుంటున్నారని అన్నారు. అదేంటంటే.. ఆరోగ్యం కావాలా డబ్బులు కావాలా అన్న విధంగా మాట్లాడుతున్నారని చెప్పారు. డబ్బులు లేకపోతే గాంధీ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ వచ్చిన వారి పక్కన బెడ్ ఇస్తామంటూ దారుణంగా మాట్లాడుతున్నారని అన్నారు. మరోపక్క ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిపై వివక్ష చూపుతున్నారని అన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఆంధ్రకు వెళ్లడమే మంచిదని ఆయన చెబుతున్నారు. ప్రతి ఒక్కరు డబ్బు కోసమే తప్ప సహాయం చేద్దామనే ఆలోచన చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-05-12T04:19:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising