ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగ‌స్టు 15 వేడుక‌ల‌పై మ‌స్క‌ట్‌లోని భార‌త ఎంబ‌సీ కీల‌క నిర్ణ‌యం

ABN, First Publish Date - 2020-08-11T20:03:08+05:30

మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో మ‌స్క‌ట్‌లోని భార‌త ఎంబ‌సీ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగ‌స్టు 15 వేడుక‌ల‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మ‌స్క‌ట్‌: మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో మ‌స్క‌ట్‌లోని భార‌త ఎంబ‌సీ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగ‌స్టు 15 వేడుక‌ల‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కోవిడ్ వ్యాప్తి నియంత్ర‌ణ‌లో భాగంగా ఈ ఏడాది దౌత్య కార్యాల‌యం వ‌ద్ద స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా నిర్వ‌హించే ప‌బ్లిక్ సెల‌బ్రేష‌న్స్‌ను ర‌ద్దు చేసిన్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈసారి జాతీయ ప‌తాకం ఆవిష్క‌ర‌ణ, అంబాసిడ‌ర్ ప్ర‌సంగం త‌దిత‌ర కార్య‌క్ర‌మాలు ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్ష‌ ప్ర‌సారం చేస్తామ‌ని వెల్ల‌డించింది. క‌నుక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భార‌త ప్ర‌వాసులు, మిత్రులు ఎంబసీ వ‌ద్ద‌కు రావొద్ద‌ని అభ్య‌ర్థించింది. ఇక ఆగ‌స్టు 15 ఉద‌యం 8.45 గంట‌ల‌కు భార‌త రాయ‌బారి మును మ‌హావ‌ర్ జాతీయ ప‌తాకం ఆవిష్క‌రించి... భార‌త రాష్ట్ర‌ప‌తి సందేశాన్ని చ‌దివి వినిపిస్తారు. ఈ కార్య‌క్ర‌మానికి రాయ‌బార కార్యాల‌యం అధికారులు, సిబ్బంది మాత్ర‌మే పాల్గొంటారు. ప్ర‌జ‌ల‌ను ఈ వేడుక‌ల‌కు అనుమ‌తించ‌రు. క‌నుక ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్షంగా వీక్షించేందుకు ఎంబ‌సీ ఏర్పాట్లు చేసింది.   


Updated Date - 2020-08-11T20:03:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising