ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఏడాది హజ్ యాత్ర రద్దు: కేంద్ర ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-06-24T01:54:35+05:30

కరోనా కారణంగా ఈ ఏడాది హజ్ యాత్రను రద్దు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఈ ఏడాది హజ్ యాత్రను రద్దు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు సౌదీ ప్రభుత్వమే భారతదేశం నుంచి ఎవరిని హజ్ యాత్రకు పంపొద్దంటూ కోరిందని మైనారిటి అఫైర్స్ మంత్రి ముక్తర్ అబ్బాక్ నఖ్వీ తెలిపారు. విదేశీ సందర్శకులను హజ్ యాత్రకు అనుమతించడం లేదని సౌదీ ప్రభుత్వం సోమవారం ప్రకటన విడుదల చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. సౌదీ ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని ముక్తర్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి హజ్ యాత్రను రద్దు చేయడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు. కాగా.. ఈ ఏడాది హజ్ యాత్ర కోసం మొత్తంగా 2,13,000 దరశాస్తులు వచ్చినట్టు ముక్తర్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. అయితే యాత్ర రద్దు కావడంతో డబ్బును తిరిగి ఆన్‌లైన్ ద్వారా రిఫండ్ చేస్తున్నట్టు చెప్పారు. హజ్ 2020 యాత్ర జులై నెలాఖరులో లేదా ఆగస్ట్ నెల ప్రారంభంలో మొదలుకానుంది. ముస్లిం మతస్థులు హజ్ యాత్రను ఎంతో పవిత్రంగా భావిస్తారు. తమ జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్లాలని వారు కోరుకుంటారు.

Updated Date - 2020-06-24T01:54:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising