ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చదువుకోడానికి చర్చికి వెళ్లిన యువతిని.. అత్యాచారం చేసి దారుణంగా..

ABN, First Publish Date - 2020-06-04T01:06:56+05:30

నైజీరియాకు చెందిన వెరా ఉవైలా ఒమోజువా(22) అనే యువతి దారుణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెనిన్ సిటి: నైజీరియాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. బెనిన్ సెటికి చెందిన వెరా ఉవైలా ఒమోజువా(22) అనే యువతి చర్చిలో దారుణ హత్యకు గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెరా ఉవైలా యూనివర్శిటి ఆఫ్ బెనిన్‌లో మైక్రోబయాలజీ చదువుతోంది. బుధవారం బెనిన్ సిటీలో ఖాళీగా ఉన్న రిడీమ్డ్ క్రీస్టియన్ చర్చ్ ఆఫ్ గాడ్(ఆర్‌సీసీజీ) చర్చికి చదువుకుందాం అని వెరా ఉవైలా వెళ్లింది. కొద్ది గంటల తర్వాత చర్చి సెక్యూరిటి గార్డు లోపలకు వచ్చి చూడగా.. రక్తపు మడుగులో వెరా ఉవైలా పడి ఉంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమెపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు నిర్థారించారు. అత్యాచారం చేసి ఎవరో హత్యాయత్నానికి పాల్పడినట్టు వైద్యులు చెప్పారు. ఆసుపత్రిలో వైద్యం పొందుతూనే వెరా ఉవైలా ప్రాణాలు విడిచింది. వెరా ఉవైలా మరణం తరువాత నైజీరియాలో వందలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. వెరా ఉవైలా మరణానికి తగిన న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని మరోపక్క పోలీసులు చెప్పారు. ఆర్‌సీసీజీ చర్చి కూడా దీనిపై స్పందించింది. చర్చి గ్లోబల్ లీడర్ అయిన పాస్టర్ ఎనోచ్ అడెబోయ్ ఈ హత్యను ఖండించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులతో కలిసి పనిచేస్తున్నామని.. త్వరలోనే నిందితులు దొరుకుతారని ఆశిస్తున్నట్టు చెప్పారు.

Updated Date - 2020-06-04T01:06:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising