ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యూయార్క్ నగర వీధికి 'పంజాబ్ అవెన్యూ'గా నామకరణం !

ABN, First Publish Date - 2020-11-25T23:34:56+05:30

క్వీన్స్ బరోలోని రిచ్మండ్ హిల్ ప్రాంతానికి దక్షిణాసియా సమాజం అందించిన సహకారాన్ని గౌరవిస్తూ అక్కడి స్థానిక అధికారులు ఈ న్యూయార్క్ నగర వీధికి 'పంజాబ్ అవెన్యూ' అనే పేరు పెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: క్వీన్స్ బరోలోని రిచ్మండ్ హిల్ ప్రాంతానికి దక్షిణాసియా సమాజం అందించిన సహకారాన్ని గౌరవిస్తూ అక్కడి స్థానిక అధికారులు ఈ న్యూయార్క్ నగర వీధికి 'పంజాబ్ అవెన్యూ' అనే పేరు పెట్టారు. పంజాబీలు అధికంగా ఉండి.. వ్యాపార కార్యాకలాపాలు నిర్వహించే ఈ ప్రాంతాన్ని ఇంతకుముందు 'లిటిల్ పంజాబ్‌'గా పిలిచేవారు. అలాగే ఈ ప్రాంతంలో రెండు గురుద్వారాలు కూడా ఉన్నాయి. దీంతో తాజాగా ఈ ప్రాంతాన్ని స్థానిక అధికారులు 'పంజాబ్ అవెన్యూ'గా నామకరణం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికి చెందిన పలువురు నివాసితులు 'Punjab Av' పేరుతో ఉన్న బోర్డు ఫొటోలు, వీడియోను ట్వీట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. కాగా, ఈ వీధికి ఈ పేరు రావడం కోసం సిటీ కౌన్సిల్ సభ్యుడు అడ్రియన్ ఆడమ్స్ తీవ్రంగా ప్రయత్నించారని సీబీఎస్ న్యూయార్క్ నివేదిక పేర్కొంది.   



Updated Date - 2020-11-25T23:34:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising