ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ రాష్ట్రంలో బిడెన్, ట్రంప్ మధ్య పోటాపోటీ..

ABN, First Publish Date - 2020-09-30T00:43:28+05:30

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఇటీవల వెలువడిన సర్వే పోల్స్ ఫలితాల్లో డెమొక్రటిక్ అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ వైపే అమెరికన్లు మొగ్గుచూపుతున్నట్లు తేలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నార్త్ కరోలినా: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఇటీవల వెలువడిన సర్వే పోల్స్ ఫలితాల్లో డెమొక్రటిక్ అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ వైపే అమెరికన్లు మొగ్గుచూపుతున్నట్లు తేలింది. ఈసారి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓటమి తప్పకపోవచ్చని సర్వే పోల్స్ ఫలితాలు తేల్చి చెప్పాయి. అయితే, యూఎస్‌లోని మిగతా రాష్ట్రాల ఫలితాలు ఎలా ఉన్న... ఒక్క నార్త్ కరోలినాలో మాత్రం బిడెన్, ట్రంప్ మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని సోమవారం వెలువడిన సర్వే ఫలితాలు తేల్చాయి.


తాజాగా వెలువడిన నార్త్ కరోలినా సర్వే పోల్స్ ఫలితాల్లో బిడెన్‌కు 45.70 శాతం మంది ఓటర్లు మద్దతు తెలపగా, ట్రంప్‌కు 45.40 శాతం మంది జై కొట్టారు. మరో 6 శాతం మంది మాత్రం తాము ఇంకా ఇద్దరిలో ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోలేదని చెప్పారు. అంటే.. ట్రంప్‌, బిడెన్ మధ్య ఇక్కడ ఓట్ల వత్యాసం చాలా తక్కువ అని ఈ ఫలితాలను చూస్తే అర్థం అవుతోంది. దీంతో ఇక్కడి ఫలితం చివరివరకు ఉత్కంఠతను రేపడం ఖాయమని తెలుస్తోంది. 


ఇదిలా ఉంటే.. 2016లో కూడా ట్రంప్ నార్త్ కరోలినాలో స్వల్ప తేడాతో గెలిచారు. ఇండిపెండెంట్ ఓటర్లతో కలుపుకుని ట్రంప్ 43.1 శాతం ఓట్లు సాధించారు. అదే బిడెన్‌కు ఇక్కడ 39.8 శాతం ఓట్లు పోలయ్యాయి. దీంతో స్వల్ప మెజారిటీతో ట్రంప్ గట్టెక్కారు. అయితే, ఈసారి ఎంతో కీలకమైన ఈ రాష్ట్రంలో ట్రంప్ గెలుపు అంతా సులువు కాకపోవచ్చు. అటు బిడెన్‌కు ఇక్కడ గట్టిపోటీ ఉండబోతుంది. కనుక ఇద్దరిలో ఎవరు గెలిచిన స్వల్ప మెజారిటీ మాత్రమే ఉండనుంది.  

Updated Date - 2020-09-30T00:43:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising