ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా అతలాకుతలం.. ఆ రెండు రాష్ట్రాల్లోనే అత్యధిక కరోనా కేసులు!

ABN, First Publish Date - 2020-03-30T16:41:48+05:30

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికాపై కూడా కొవిడ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. కాగా.. న్యూయార్క్, న్యూజెర్సీలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికాపై కూడా కొవిడ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. కాగా.. న్యూయార్క్, న్యూజెర్సీలో ఈ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. న్యూజెర్సీలో ఆదివారం ఒక్కరోజే 161 మంది మరణించగా.. సుమారు 2,316 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కొవిడ్-19 బారినపడ్డవారి సంఖ్య 13,386కు చేరిందని.. న్యూజెర్సీ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇకపోతే.. అమెరికాలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు న్యూయార్క్‌లోనే నమోదవుతున్నాయి. వరల్డ్ఒమీటర్.ఇన్‌ఫో లోని సమాచారం ప్రకారం.. న్యూయార్క్‌లో నిన్న ఒక్కరోజే 6,255 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య న్యూయార్క్‌లో 59,648కి చేరింది. కాగా.. ఆదివారంరోజు న్యూయార్క్‌లో కరోనాకాటుకు సుమారు 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే అమెరికాలో ఇప్పటి వరకు మహమ్మారి  బారినపడి 2,485 మంది మరణించారు. 1.42లక్షల మంది కొవిడ్-19 బారినపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఇతర ఏ దేశంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదు కాలేదు. 


Updated Date - 2020-03-30T16:41:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising