ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఇండియన్ కమ్యూనిటీ!

ABN, First Publish Date - 2020-07-13T01:49:41+05:30

విదేశీ విద్యార్థుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని.. అమెరికాలోని ఇండియన్ కమ్యూనిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. ముఖ్యంగా భార

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: విదేశీ విద్యార్థుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని.. అమెరికాలోని ఇండియన్ కమ్యూనిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు న్యాయం జరిగేలా.. ట్రంప్ తన వైఖరి మార్చుకునేలా ఇండియన్ కమ్యూనిటీ ఒత్తిడి తెస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమరికా అధ్యక్ష పదవికి నవంబర్ 3న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపొంది తిరిగి అధికారలంలోకి రావడంపై దృష్టిపెట్టిన డొనాల్డ్ ట్రంప్.. అమెరికన్ల ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. కరోనా కారణంగా రోడ్డున పడ్డ కోట్లాది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించడం కోసం.. హెచ్1బీ సహా ఉపాధి ఆధారిత వీసాల జారీపై నిషేధం విధించారు. తాజాగా.. అమెరికాలోకి విదేశీ విద్యార్థుల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు.  ఈ నేపథ్యంలో ‘వచ్చే విద్యా సంవత్సరానికి గానూ పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించేందుకు సిద్ధమైన కాలేజీల్లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వీసా జారీచేయబోం’ అంటూ అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఎఫ్-1, ఎం-1పై ప్రస్తుతం అమెరికాలో ఉంటూ ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్నవారు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఏటీఏ).. స్పందించింది. ట్రంప్ నిర్ణయం వల్ల విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను.. యూఎస్ కాంగ్రెస్ ప్రతినిధలకు తెలియజేసింది. ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఒత్తిడి చేయాలని కోరింది. అంతేకాకుండా సుమారు 50 మంది సెనేటర్‌లను కలిసి.. ట్రంప్ నిర్ణయంపై అభ్యంతరం తెలుపుతూ మెమోరండం సమర్పించింది. మరోవైపు నార్త్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్టూడెంట్ (ఎన్ఏఏఐఎస్) ఆర్గనైజేషన్ కూడా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని ప్రారంభించింది. 


Updated Date - 2020-07-13T01:49:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising