ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సినీ కార్మికులకు చేయూతనిచ్చిన నాట్స్

ABN, First Publish Date - 2020-06-01T07:58:25+05:30

లాక్‌డౌన్ ప్రభావంతో సినిమాల నిర్మాణం ఆగిపోవడంతో సినీ కార్మికులు తీవ్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: లాక్‌డౌన్ ప్రభావంతో సినిమాల నిర్మాణం ఆగిపోవడంతో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్ మొదలైన నాటి నుంచి ఎంతో మందికి సాయం చేస్తూ వచ్చిన ఉత్తర అమెరికా తెలుగుసంఘం(నాట్స్) తాజాగా సినీ కార్మికులకు సైతం చేయూత అందించింది. నాట్స్ బోర్డు చైర్మన్ శ్రీథర్ అప్పసాని చొరవతో సినీ కార్మికులకు నాట్స్ సాయం చేసింది. దాదాపు 34 కుటుంబాలకు నాట్స్ తరపున నిత్యావసరాలను పంపిణీ చేసింది. ఈ కష్టకాలంలో తమను కూడా గుర్తించి ఆదుకున్నందుకు సినీ కార్మికులు నాట్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి మాట్లాడుతూ.. నాట్స్ సంస్థ ఎల్లపుడు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తెలుగు వారికి అండగా ఉంటుందని తెలిపారు. అభ్యుదయ సినీ రచయిత లీలా సుబ్రహ్మణ్యం కార్మికుల కష్టాన్ని గమనించి నాట్స్ దృష్టికి తీసుకురావడంతో.. నాట్స్ సాయం చేయడానికి ముందుకొచ్చింది. 

Updated Date - 2020-06-01T07:58:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising