ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రుడిపై నీటి జాడ.. సూర్యకాంతి పడే ప్రదేశాల్లో కనుగొనడం తొలిసారి

ABN, First Publish Date - 2020-10-28T09:42:00+05:30

చంద్రుడిపై నీటి జాడ కోసం చాలా దేశాలే ప్రయత్నిస్తున్నాయి. నీరు ఉంటే చందమామపై సూర్యకాంతి పడని ప్రదేశాల్లో, నీడలు ఏర్పడ్డ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, అక్టోబరు 27: చంద్రుడిపై నీటి జాడ కోసం చాలా దేశాలే ప్రయత్నిస్తున్నాయి. నీరు ఉంటే చందమామపై సూర్యకాంతి పడని ప్రదేశాల్లో, నీడలు ఏర్పడ్డ చోట్ల మాత్రమే ఉం టుందని శాస్త్రజ్ఞులు భావించారు. కానీ, ఖగోళ చరిత్రలో తొలిసారి భూమిపై నుంచి చంద్రుడి దక్షిణార్థ గోళంలో కనిపించే అతి పెద్ద బిలం.. చంద్రుడి దక్షిణార్థ గోళంలోని ‘క్లేవియస్‌ క్రేటర్‌’లో నీటి అణువులను నాసా శాస్త్రజ్ఞులు గుర్తించారు. నాసాకు చెందిన ‘స్ట్రాటోస్ఫియరిక్‌ అబ్జర్వేటరీ ఫర్‌ ఇన్‌ ఫ్రారెడ్‌ ఆస్ట్రానమీ(సోఫియా)’ సాయంతో వారు చందమామపై నీటి అణువుల జాడను గు ర్తించగలిగారు. ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-1 మిషన్‌ సహా గత అధ్యయనాల్లో చంద్రుడిపై హైడ్రోజన్‌ జాడలున్నట్టు గుర్తించారు. కానీ, పూర్తి స్పష్టత లేదు. నాసా శాస్త్రజ్ఞుల తాజా అధ్యయనం లో క్లేవియస్‌ బిలంలో 100-412 పార్ట్స్‌ పర్‌ మిలియన్‌(పీపీఎం) గాఢతతో నీరు ఉన్నట్టు వెల్లడైం ది. అంటే ఒక ఘనపు మీటరు మట్టిలో (అంటే 1000 లీటర్ల నీరు పట్టే ప్రదేశం) 12 ఔన్సుల (దాదాపు 350 మిల్లీలీటర్లు) నీరు ఉన్నట్టు లెక్క.

Updated Date - 2020-10-28T09:42:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising