ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌదీలో తెలుగు వ్య‌క్తికి అనుకోని క‌ష్టాన్ని తెచ్చిపెట్టిన 'క‌రోనా'..!

ABN, First Publish Date - 2020-04-09T20:03:35+05:30

సౌదీ అరేబియాలో క‌రోనావైర‌స్‌(కొవిడ్‌-19) విజృంభిస్తోంది. రోజురోజుకీ క‌రోనా కేసులు పెరిగి పోతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు సౌదీలో 2,932 మంది క‌రోనా బాధితులు ఉండ‌గా, 41 మంది మృత్యువాత ప‌డ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాధ్: సౌదీ అరేబియాలో క‌రోనావైర‌స్‌(కొవిడ్‌-19) విజృంభిస్తోంది. రోజురోజుకీ క‌రోనా కేసులు పెరిగి పోతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు సౌదీలో 2,932 మంది క‌రోనా బాధితులు ఉండ‌గా, 41 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో సౌదీ స‌ర్కార్‌ ఈ వైర‌స్ క‌ట్ట‌డికి క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టింది. ప్ర‌జ‌ల‌ను ఇళ్ల‌కు ప‌రిమితం చేయ‌డంతో పాటు బ‌హిరంగ ప్ర‌దేశాల్లో జ‌న‌స‌మూహాలు, ఉమ్మివేయ‌డాన్ని పూర్తిగా నిషేధించింది. ఇదిలాఉంటే తాజాగా సౌదీలో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఓ వ్య‌క్తిపై క‌రోనా నేప‌థ్యంలోనే హ‌త్య‌ అభియోగం మోప‌బ‌డింది.


కరోనా వ్యాప్తికి కారణమంటూ సౌదీలో ప్రవాసీపై ఈ అభియోగాలు మోపారు. మార్కెట్‌కు వెళ్లిన ప్ర‌వాసీ పొరపాటున తుమ్మి సామాన్లను ముట్టుకోవడం చూసిందో అరబ్బు చిన్నారి. దాంతో బెదిరిపోయిన ఆ చిన్నారి పెద్ద‌గా అరిచింది. బాలిక‌ కేకలపై రంగంలో దిగిన పోలీసులు.. తెలుగు వ్య‌క్తిని అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షలకు తరలించారు. ఈ వైద్య ప‌రీక్ష‌ల్లో ప్ర‌వాసీయుడికి క‌రోనా సోకిన‌ట్లు తేలింది. దీంతో కరోనా వ్యాప్తికి కారణమయ్యాడంటూ సౌదీలో  అత‌నిపై హత్య అభియోగాలు మోప‌బ‌డ్డాయి. ఇలా తెలుగు వ్య‌క్తికి క‌రోనా అనుకోని క‌ష్టాన్ని తెచ్చిపెట్టింది.  

Updated Date - 2020-04-09T20:03:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising