ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొడుకు ద్వారా తల్లికి కరోనా..

ABN, First Publish Date - 2020-03-16T10:46:02+05:30

విదేశాల నుంచి కరోనాను వెంటబెట్టుకు వచ్చిన కొడుకు కోలుకుంటుండగా.. అతని ద్వారా ఆ మహమ్మారి సోకిన తల్లి చనిపోయింది. వైరస్‌ లక్షణాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కోలుకుంటున్న కొడుకు.. బలైపోయిన తల్లి

న్యూఢిల్లీ, మార్చి 15: విదేశాల నుంచి కరోనాను వెంటబెట్టుకు వచ్చిన కొడుకు కోలుకుంటుండగా.. అతని ద్వారా ఆ మహమ్మారి సోకిన తల్లి చనిపోయింది. వైరస్‌ లక్షణాలు ఉన్నవాళ్లను ఎందుకు ఏకాంతవాసంలో ఉండమంటున్నారనడానికి ఢిల్లీలో జరిగిన ఈ ఘటనే ఓ నిదర్శనం. ఒక వ్యక్తి గత నెలలో స్విట్జర్లాండ్‌, ఇటలీ వెళ్లి తిరిగి వచ్చాడు. మొదట్లో కరోనా లక్షణాలేవీ కనిపించలేదు. ఒకరోజు తర్వాత జ్వరం, దగ్గు రావడంతో రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రికి వెళ్లాడు. తల్లికి కూడా జ్వరం, దగ్గు ఉండడంతో ఇద్దరికీ చికిత్స ప్రారంభించారు. వైద్య పరీక్షల్లో ఇద్దరికీ కరోనా ఉందని తేలింది. కాగా, షుగర్‌, బీపీ ఉండడంతో పరిస్థితి విషమించి తల్లి మృతిచెందింది. కుమారుడి ఆరోగ్యం మెరుగవడంతో ఐసొలేషన్‌ వార్డుకు మార్చారు.


Updated Date - 2020-03-16T10:46:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising