ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రరాజ్యంలో కరోనా విలయం.. 24 గంటల్లో 2500 మంది!

ABN, First Publish Date - 2020-12-02T22:37:13+05:30

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తోంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు వెలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తోంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. గడిచిన 24 గంటల్లో అమెరికాలో కొవిడ్ మహమ్మారికి దాదాపు 2500 మందికిపైగా ప్రజలు బలైనట్టు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ఏప్రిల్ తర్వాత ఇంత భారీ స్థాయిలో కరోనా మరణాలు సంభవించడం ఇదే తొలిసారని పేర్కొంది. కాగా.. మంగళవారం రోజు అమెరికాలో కొవిడ్ బారినపడిన వారి సంఖ్య 1.80లక్షలు దాటింది. ఇదిలా ఉంటే.. అమెరికాలో సగటున నిమిషానికి ఒక కరోనా మరోణం నమోదువుతుందని గ్లోబల్ హెల్త్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ బెత్ బెల్ తెలిపారు. ఇప్పటి వరకు అమెరికాలో 1.41కోట్ల మంది కరోనా బారినపడగా.. మరణాల సంఖ్య 2.80లక్షలకు చేరువైంది. 


ఇదిలా ఉంటే.. కరోనా టీకాపైనే అమెరికా ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే ఫైజర్, మోడెర్నా సంస్థలు తాము అభివృద్ధి చేసిన టీకా 90శాతానిపైగా సమర్థవంతంగా పని చేస్తున్నట్లు ప్రకటించాయి. టీకా అత్యవసర వినియోగం కోసం అనుమతి కోరుతూ ఎఫ్‌డీఏ, ఈయూకు దరఖాస్తు కూడా చేసుకున్నాయి. డిసెంబర్ చివరి నాటికి అమెరికన్లు ఈ వ్యాక్సిన్లు అందుబాటులోకి రావొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


Updated Date - 2020-12-02T22:37:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising