ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో ఆమోదం దిశగా మరో కొవిడ్ టీకా..!

ABN, First Publish Date - 2020-12-17T00:19:22+05:30

మహమ్మారి కరోనాతో సతమతమవుతున్న అగ్రరాజ్యం అమెరికాకు ఫైజర్ వ్యాక్సిన్ పెద్ద ఊరటగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎఫ్‌డీఏ ఆమోదం దిశగా 'మోడెర్నా'..!

వాషింగ్టన్: మహమ్మారి కరోనాతో సతమతమవుతున్న అగ్రరాజ్యం అమెరికాకు ఫైజర్ వ్యాక్సిన్ పెద్ద ఊరటగా మారింది. ఇప్పుడు ఇదే బాటలో మోడెర్నా టీకా కూడా త్వరలోనే అమెరిక్లనకు అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ట్రయల్స్‌లో ఫైజర్‌తో పాటు మోడెర్నా కూడా సురక్షితమైందిగా, సమర్థవంతమైందిగా తేలింది. తాజాగా ఈ వ్యాక్సిన్ సమర్థతపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) సానుకూల నివేదిక ఇచ్చినట్లు ఓ ప్రముఖ అమెరికన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. 30 వేల మంది మోడెర్నా టీకా ట్రయల్స్‌లో పాల్గొనగా.. వ్యాక్సిన్ ప్రభావశీలత 94.1 శాతం అని తేలింది. అలాగే టీకా తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా ఏమీ లేవని ఎఫ్‌డీఏ నిర్ధారించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కనిపించే జ్వరం, చలి, తలనొప్పి లాంటి లక్షణాలు. అవి కూడా తీవ్రస్థాయిలో ఏమీ లేవట. దీంతో గురువారం టీకా వినియోగంపై ఎఫ్‌డీఏ కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. 


ఇక ఇప్పటికే కొవిడ్ దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా మందిని పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. అంతకంతకు పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. వైరస్ బాధితులు గణనీయంగా పెరుగుతుండటం పట్ల ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అగ్రరాజ్యం సాధ్యమైనంత త్వరగా ప్రజలకు టీకాలు అందించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం నుంచి ఫైజర్ వ్యాక్సినేషన్ ప్రారంభించింది. తాజాగా మోడెర్నా కూడా సత్ఫలితాలు ఇవ్వడం, ఎఫ్‌డీఏ సైతం టీకా సమర్థతపై సంతృప్తిని వ్యక్తం చేయడం అమెరికన్లకు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. అమెరికా ఇప్పటికే 200 మిలియన్ల మోడెర్నా డోసుల కోసం ఆర్డర్ చేసిందని సమాచారం. ఈ నెలలో మొదటి షిప్‌మెంట్ కింద 20 మిలియన్ల డోసులు యూఎస్‌కు అందనున్నాయి. మరో 80 మిలియన్ల డోసులు 2021 మొదటి త్రైమాసికంలో, మిగిలిన 100 మిలియన్ల డోసులు రెండో త్రైమాసికంలో అమెరికా చేతికి వస్తాయి.    


దేశంలో ఫైజర్ వ్యాక్సినేషన్ ప్రారంభించిన తర్వాతి రోజే మోడెర్నా వ్యాక్సిన్‌పై ఎఫ్‌డీఏ సానుకూలంగా స్పందించడం విశేషం. కాగా.. ఫైజర్‌, మోడెర్నా టీకాలు మెసెంజర్ RNA సాంకేతికతతో అభివృద్ధి చేశారు. పైగా ఫైజర్‌ను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ వద్ద స్టోర్ చేయాల్సి ఉండగా.. మోడెర్నాను సాధారణ ఫ్రీజ్‌లలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మోడెర్నాను కూడా అత్యవసర వినియోగానికి ఎఫ్‌డీఏ ఆమోదించడం ఖాయం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2020-12-17T00:19:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising