ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెక్సికోలో కొనసాగుతున్న కరోనా విలయం..!

ABN, First Publish Date - 2020-07-11T02:42:54+05:30

ప్రపంచ దేశాలపై కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కాగా.. మెక్సికోలో కరోనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెక్సికో సిటీ: ప్రపంచ దేశాలపై కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కాగా.. మెక్సికోలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గురువారం ఒక్కరోజే మెక్సికోలో 7,280 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కాటుకు నిన్న 730 మంది బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు మెక్సికోలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2.82లక్షలకు చేరింది. 33వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా.. కరోనా కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో మెక్సికో 9వ స్థానంలో ఉంది. అయితే మరణాల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో మాత్రం మెక్సికో 5వ స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1.24కోట్లుకు చేరింది. 5.58లక్షల మందిని మహమ్మారి పొట్టన పెట్టుకుంది. 


Updated Date - 2020-07-11T02:42:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising