ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిష్టను దెబ్బతీశాడంటూ కోర్టులో కేసు వేసిన మహిళ.. జడ్జి ఏం తీర్పిచ్చారంటే..

ABN, First Publish Date - 2020-09-18T06:24:32+05:30

మహిళ అనుమతి లేకుండా ఆమె ఇంటిలోకి వెళ్లినందుకు 45,000 దిర్హామ్‌లు(రూ. 9 లక్షలు) నష్టపరిహారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబూధాబీ: మహిళ అనుమతి లేకుండా ఆమె ఇంటిలోకి వెళ్లినందుకు 45,000 దిర్హామ్‌లు(రూ. 9 లక్షలు) నష్టపరిహారం చెల్లించాలంటూ ఓ వ్యక్తిని అబూధాబీ కోర్టు ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు కొద్ది రోజుల క్రితం బాధితురాలి ఇంటిలోకి ఆమె అనుమతి లేకుండా వెళ్లాడు. అంతేకాకుండా ఇంటిలోకి ఎందుకు ప్రవేశించాడన్న కారణం కూడా మహిళకు చెప్పలేదు. దీంతో నిందితుడి వల్ల స్థానికంగా తన ప్రతిష్టకు హాని కలిగిందంటూ మహిళ కోర్టులో కేసు వేసింది. బాధితురాలి వాదనను విన్న జడ్జి నిందితుడికి 50 వేల దిర్హామ్‌ల(రూ. పది లక్షలు) జరిమానా విధించారు. ఇక తన ప్రతిష్టకు హాని కలిగినందుకు గాను లక్ష దిర్హామ్‌ల(రూ. 20 లక్షలు) నష్టపరిహారం చెల్లించాలని మహిళ సివిల్ కేసు వేయగా.. 45,000 దిర్హామ్‌లు మహిళకు నష్టపరిహారంగా చెల్లించాలంటూ కోర్టు నిందితుడిని ఆదేశించింది.

Updated Date - 2020-09-18T06:24:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising