ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదృష్టమంటే ఇతనిదే.. రాయి అనుకొని బ్యాగులో వేసుకున్న వస్తువు కాస్తా..

ABN, First Publish Date - 2020-09-26T15:44:48+05:30

అదృష్టమనేది ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో తెలియదు. యూఎస్‌లోని అర్కాన్సాస్‌కు చెందిన ఓ బ్యాంక్ మేనేజర్‌కు అదృష్టం రాయిరూపంలో తగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అర్కాన్సాస్‌(యూఎస్): అదృష్టమనేది ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో తెలియదు. యూఎస్‌లోని అర్కాన్సాస్‌కు చెందిన ఓ బ్యాంక్ మేనేజర్‌కు అదృష్టం రాయిరూపంలో తగిలింది. అర్కాన్సాస్‌లోని క్రాటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్‌కు వెళ్లిన మౌమెల్లెకు చెందిన కెవిన్ కినార్డ్ అనే బ్యాంక్ మేనేజర్‌కు ఒక మెరిసే రాయి దొరికింది. దాంతో అతను దానిని తన బ్యాగులో వేసుకున్నాడు. బ్యాగులో వేసుకున్న ఆ రాయినే కెవిన్‌కు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. రాయి అనుకుంటే.. అది కాస్తా కోట్ల విలువ చేసే వజ్రం అని తేలింది. తాను తీసుకొచ్చిన వస్తువు 9.07 క్యారెట్ల డైమండ్ అని తెలియడంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 


కాగా, అర్కాన్సాస్‌ స్టేట్ పార్క్‌లో ఒకప్పుడు డైమండ్స్‌ బాగా దొరికేవట. ఇప్పటికీ ఆ పార్క్‌కు వెళ్లిన వారిలో చాలా మంది డైమండ్ల కోసం వెతకడం చూస్తుంటానని కెవిన్ చెప్పాడు. తాను చిన్నప్పటి నుంచి ఆ పార్క్‌కు వెళ్తున్నప్పటికీ ఎప్పుడూ డైమండ్ దొరకలేదని తెలిపాడు. అయితే, ఈ నెల 7న స్నేహితులతో కలిసి సరదాగా అర్కాన్సాస్‌ స్టేట్ పార్క్‌కు వెళ్లిన తనకు మెరుపులతో కూడిన రాయిలాంటి వస్తువు దొరకడం.. దానిని బ్యాగులో వేసుకోవడం.. తీరా తర్వాత పరీక్షించి చూస్తే అది విలువైన వజ్రంగా తేలడం నమ్మలేకపోతున్నానని కెవిన్ చెప్పుకొచ్చాడు. అంతేగాక అర్కాన్సాస్‌ స్టేట్ పార్క్‌ చరిత్రలోనే తనకు దొరికిన 9.07 క్యారెట్ల వజ్రం రెండో అతిపెద్దదని తెలిపాడు.   

Updated Date - 2020-09-26T15:44:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising