ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో 26ఏళ్ల భారతీయుడు అరెస్ట్.. జైలు శిక్ష విధించిన కోర్టు!

ABN, First Publish Date - 2020-08-03T20:24:06+05:30

తాను ఓ సినిమా ప్రోడ్యూసర్‌నని నమ్మబలికి.. కొంత మంది దగ్గర డబ్బులు వసూలు చేసి, మోసం చేసిన ఘటనలో 26ఏళ్ల భారతీయ యువకుడు అమెరికాలో కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. శివ చందన్ రెడ్డి అనే యువకుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: తాను ఓ సినిమా ప్రోడ్యూసర్‌నని నమ్మబలికి.. కొంత మంది దగ్గర డబ్బులు వసూలు చేసి, మోసం చేసిన ఘటనలో 26ఏళ్ల  భారతీయ యువకుడు అమెరికాలో కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. శివ చందన్ రెడ్డి అనే యువకుడు.. టెక్సాస్‌లోని ఇర్వింగ్ ప్రాంతంలో గత ఐదు సంవత్సరాలుగా నివసిస్తున్నాడు. ఈ క్రమంలో కొంత మంది అమెరికన్ పౌరులకు.. తనను తాను ఓ సినిమా ప్రోడ్యూసర్‌గా పరిచయం చేసుకున్నాడు. అంతేకాకుండా తాను ఓ సినిమా తీస్తున్నట్లు అమెరికన్లను నమ్మించి.. అందులో పెట్టుబడి పెట్టాల్సిందిగా కోరాడు. శివ చందన్ రెడ్డి మాటలను నమ్మిన సదరు అమెరికన్లు.. దాదాపు 1.60లక్షల డాలర్లను అతనికి సమర్పించుకున్నారు. తీరా అతను ప్రోడ్యూసర్ కాదని.. తాము ఇచ్చిన డబ్బును శివ చందన్ రెడ్డి.. తన సొంత ప్రయెజనాలకు వాడుకున్నాడని  తెలుసుకున్న అమెరికన్లు.. పోలీసులను ఆశ్రయించారు. దీంతో టెక్సాస్ పోలీసులు శివ చందన్ రెడ్డిని అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసును విచారించిన న్యాయం స్థానం.. శివ చందన్ రెడ్డిని దోషిగా తేల్చింది. అంతేకాకుండా 12నెలల జైలు శిక్షను విధించింది. 


Updated Date - 2020-08-03T20:24:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising