ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండెనొప్పితో మరణించిన సూపర్ మార్కెట్ మేనేజర్.. కస్టమర్లకు తెలియకూడదని..

ABN, First Publish Date - 2020-08-21T04:57:20+05:30

బ్రెజిల్‌లో‌ని ఓ రిటైల్ స్టోర్‌లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రసిలియా: బ్రెజిల్‌లో‌ని ఓ రిటైల్ స్టోర్‌లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. స్టోర్ మేనేజర్ గుండెనొప్పితో మరణించగా.. స్టోర్‌ను మూసివేయకుండా యాజమాన్యం మేనేజర్ మృతదేహాన్ని స్టోర్‌లోనే దాచింది. రెసిఫె సిటీలోని క్యారెఫోర్ రిటైల్ స్టోర్‌‌లో ఆగస్టు 14వ తేదీన ఈ సంఘటన చోటుచేసుకుంది. మేనేజర్ పడి ఉన్న ప్రదేశాన్ని గొడుగులు, బాక్సులతో కస్టమర్లకు కనిపించకుండా స్టోర్ యాజమాన్యం దాచింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు స్టోర్ యాజమాన్యంపై మండిపడుతున్నారు. బ్రెజిల్‌లో కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతోంటే.. స్టోర్ యాజమన్యం ఈ విధంగా ప్రవర్తించడం సరికాదని నెటిజన్లు చెబుతున్నారు. ఇక ఈ ఘటనపై స్టోర్ యాజమాన్యం స్పందిస్తూ.. మృతదేహాన్ని ముట్టుకోకూడదన్న ప్రభుత్వ నిబంధనలను తాము పాటించినట్టు చెప్పుకొచ్చింది. తమకు ఆ సమయంలో మృతదేహాన్ని ఏ విధంగా తరలించాలో తోచలేదని సంస్థ పేర్కొంది. ఆ సమయంలో తాము వేరే విధంగా స్పందించి ఉండాల్సిందని సంస్థ క్షమాపణలు తెలిపింది. మరోపక్క మేనేజర్ కుటుంబానికి కూడా సంస్థ క్షమాపణలు చెబుతూ.. వారికి కావాల్సిన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది.

Updated Date - 2020-08-21T04:57:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising