ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్ల జాతీయులకు మలేషియా బ్యూటీ క్వీన్ క్షమాపణలు

ABN, First Publish Date - 2020-06-03T21:55:37+05:30

నల్ల జాతీయులను విమర్శించేలా చేసిన వ్యాఖ్యలపై మలేషియాకు చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కౌలాలంపూర్: నల్ల జాతీయులను విమర్శించేలా చేసిన వ్యాఖ్యలపై మలేషియాకు చెందిన బ్యూటీ క్వీన్ సమంత క్యాటీ జేమ్స్ క్షమాపణలు తెలిపింది. అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణంపై నిరసనలు మిన్నంటిన విషయం తెలిసిందే. ఇటువంటి సమయంలో సమంత ‘నల్ల జాతీయులు రిలాక్స్ అవ్వండి. దీన్ని చాలెంజ్‌గా తీసుకోండి’ అంటూ పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా ‘అమెరికాలో ఓ నిర్దిష్ట పాఠం నేర్చుకోవడానికే మీరు నల్ల రంగులో పుట్టాలని ఎంచుకున్నారు’ అంటూ ఆమె పెట్టిన పోస్ట్ పెద్ద దుమారమైంది. నెటిజన్లు ఈ వ్యాఖ్యలను తప్పుపట్టారు. సమంత 2017లో గెలుచుకున్న మిస్ యూనివర్శ్ మలేషియా కిరీటాన్ని తొలగించాలంటూ ఆన్‌లైన్‌లో 80 వేలకు పైగా పిటీషన్లు కూడా వచ్చాయి. సమంత వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లే విధంగా ఉన్నాయంటూ అనేక మంది మండిపడ్డారు. వివిధ దేశాలకు చెందిన అనేక మంది నటులు కూడా సమంత వ్యాఖ్యలను విమర్శించారు. దీంతో సమంత తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు తెలిపింది. ‘నా వ్యాఖ్యల వల్ల మీరు ఆవేదన చెందుతున్నారని అర్థమైంది. అందరికి క్షమాపణలు’ అని అన్నారు.

Updated Date - 2020-06-03T21:55:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising