ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రంప్ మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంది: అమెరికన్లు

ABN, First Publish Date - 2020-05-28T22:57:53+05:30

అమెరికాలోని దాదాపు 72 శాతం మంది ఓటర్లు అధ్యక్షుడు ట్రంప్ ఫేస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలోని దాదాపు 72 శాతం మంది ఓటర్లు అధ్యక్షుడు ట్రంప్ ఫేస్ మాస్క్ ధరించాల్సిన అవసరం ఉందంటూ చెప్పుకొచ్చారు. కైజర్ ఫ్యామిలీ ఫౌండేషన్ నిర్వహించిన సర్వేలో అమెరికన్ ఓటర్లు పాల్గొన్నారు. మే 13 నుంచి 18 వరకు నిర్వహించిన ఈ సర్వేలో అమెరికన్లు తమ అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైనప్పటికి.. ట్రంప్ మాత్రం ఫేస్ మాస్క్ లేకుండా తిరిగేస్తున్నారు. ఇటీవల ఫోర్డ్ మోటర్స్ కంపెనీకి కూడా ట్రంప్ మాస్క్ లేకుండా వెళ్లారు. పైగా మాస్క్ ధరించి ప్రశ్నలు అడిగిన రిపోర్టర్‌పై కూడా మండిపడ్డారు. మరోపక్క డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ సైతం ట్రంప్ వ్యవహారంపై స్పందించారు. దేశాధ్యక్షుడు అంటే ముందుండి నాయకత్వం వహించాలి కాని ఇలా మూర్ఖంగా ప్రవర్తించకూడదని అన్నారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన గవర్నర్లు మైక్ డీవైన్, డౌగ్ బర్గమ్ కూడా మాస్క్ వినియోగంపై స్పందించారు. మాస్క్ ధరించడం రాజకీయాలకు సంబంధించిన అంశం కాదని.. ఇతరులను కాపాడే విషయమని పరోక్షంగా ట్రంప్‌పై విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా.. ఆర్థిక వ్యవస్థను ట్రంప్ సమర్థవంతంగా హ్యాండిల్ చేశారంటూ 56 శాతం మంది ట్రంప్‌కు మద్దతుగా ఓటేశారు. అధ్యక్షుడిగా దేశాన్ని నడపడంలో మాత్రం విఫలమయ్యారని 52 శాతం మంది అన్నారు.

Updated Date - 2020-05-28T22:57:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising