ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో మహాత్మాగాంధీ విగ్రహ పునరుద్దరణ

ABN, First Publish Date - 2020-07-03T03:45:15+05:30

అమెరికాలో నిరసనకారుల చేతిలో ధ్వంసానికి గురైన భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికాలో నిరసనకారుల చేతిలో ధ్వంసానికి గురైన భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని తిరిగి పునరుద్దరించారు. అమెరికాలోని భారత రాయబారి తరాంజిత్ సింగ్ గురువారం ఉదయం గాంధీ విగ్రహాన్ని తిరిగి ప్రారంభించారు. మే 27న అమెరికాలో తెల్ల పోలీసు అధికారి చేతిలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణించాడు. దీంతో నిరసనకారులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదే నేపథ్యంలో జూన్ మూడో తేదీన వాషింగ్టన్‌లోని ఇండియన్ ఎంబసీ సమీపంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. నేషనల్ పార్క్ సర్వీస్ పర్యవేక్షణలో ఉండే చిన్న పార్క్‌లో మహాత్మాగాంధీ విగ్రహం ఉంటుంది. నిరసనకారులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల ఇండియన్ ఎంబసీ, భారత సంఘాలతో పాటు వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ స్టీఫెన్ బీగన్ సైతం ఖండించారు. మరోపక్క విగ్రహ ధ్వంసం పట్ల ఇండియన్ ఎంబసీ కేసు కూడా నమోదు చేయించింది. వెంటనే పునరుద్దరణ పనులను మొదలుపెట్టగా.. తాజాగా విగ్రహాన్ని తిరిగి ప్రారంభించడం జరిగింది.

Updated Date - 2020-07-03T03:45:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising