ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోట్లలో జీతం.. కానీ చేసిన పనేమో..!

ABN, First Publish Date - 2020-02-06T02:07:36+05:30

ఎవరైనా పేదవాడు ఎక్కడైనా ఆహారాన్ని దొంగిలించాడంటే దానిలో ఏ మాత్రం ఆశ్చర్యం కలగదు. అయితే కోట్ల రూపాయల్లో శాలరీ అందుకుంటున్న వ్యక్తి శాండ్‌విచ్ చోరీ చేశా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎవరైనా పేదవాడు ఎక్కడైనా ఆహారాన్ని దొంగిలించాడంటే దానిలో ఏ మాత్రం ఆశ్చర్యం కలగదు. అయితే కోట్ల రూపాయల్లో శాలరీ అందుకుంటున్న వ్యక్తి శాండ్‌విచ్ చోరీ చేశాడంటే అది పెద్ద వార్తగా మారుతుంది. ఇటువంటి ఘటనే తాజాగా చోటుచేసుకుంది. ప్రముఖ బ్యాంకులో రూ. 9 కోట్ల జీతం అందుకుంటూ ఉన్నత ఉద్యోగంలో ఉన్న ఒక వ్యక్తి శాండ్‌విచ్ చోరీ చేశాడన్న ఆరోపణతో ఉద్యోగం కోల్పోయాడు. 31 ఏళ్ల పారస్ షా కోట్ల రూపాయల్లో శాలరీ అందుకుంటున్నాడు. గత నెలలోనే ఉద్యోగ రీత్యా పలు దేశాలల్లో పర్యటించడంతో పాటు పదోన్నతి కూడా పొందాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం సదరు బ్యాంకు యాజమాన్యం పారస్ షాపై శాండ్ విచ్ చోరీతో పాటు పలు ఆరోపణలు చేస్తూ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. పారస్ షా ఈస్ట్ లండన్‌లో గల బ్యాంకు క్యాంటీన్‌లో ఆహారం దొంగిలించాడనే ఆరోపణలు వచ్చాయి. అయితే అతను ఎన్ని శాండ్‌విచ్‌లు చోరీ చేశాడు? ఎప్పుడు చోరీ చేశాడనేది వెల్లడికాలేదు. క్రెడిట్ ట్రేడర్ పదవిలో ఉన్న పారస్ షా రూ. 9.2 కోట్ల మేరకు జీతం అందుకుంటూ, ప్రముఖ బ్యాంకుకు యూరప్, మధ్య ఆసియా, ఆఫ్రికా దేశాలకు హెడ్‌గా పనిచే‌శారు.


Updated Date - 2020-02-06T02:07:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising