గడిచిన 24 గంటల్లో అమెరికాలో కోవిడ్ మరణాలు ఎన్నో తెలిస్తే...
ABN, First Publish Date - 2020-06-17T00:40:57+05:30
కరోనా మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాలో విలయతాండవం చేస్తోంది. అంతకంతకు పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి.
వాషింగ్టన్ డీసీ: కరోనా మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాలో విలయతాండవం చేస్తోంది. అంతకంతకు పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. అయితే, వరుసగా రెండో రోజు యూఎస్‌లో మరణాల సంఖ్య 400లోపు నమోదుకావడం కాస్తా ఊరటనిచ్చే విషయమని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొంది. గడిచిన 24 గంటల్లో కేవలం 385 మరణాలు మాత్రమే నమోదైనట్లు తెలిపింది. సోమవారం కూడా దేశవ్యాప్తంగా 382 మరణాలు నమోదయ్యాయని యూనివర్సిటీ వెల్లడించింది. దేశంలో మహమ్మారి విజృంభణ మొదలైన తర్వాత ఇలా వరుసగా రెండు రోజులు 400లోపు మరణాలు నమోదుకావడం మార్చి నెల చివరి తర్వాత ఇదే తొలిసారి. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు రెండింటీలో అమెరికానే అగ్రస్థానంలో కొనసాతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు యూఎస్‌లో 21 లక్షలకు పైగా మంది ఈ మహమ్మారి బారిన పడగా... 1.18 లక్షల మంది మరణించారు.
Updated Date - 2020-06-17T00:40:57+05:30 IST