ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊహించని ప్రమాదం ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది

ABN, First Publish Date - 2020-08-08T22:06:49+05:30

కరోనా కాలంలో పరాయి దేశంలో బిక్కుబిక్కుమంటూ బతికింది ఓ కుటుంబం. సుమారు ఐదు నెలల తర్వాత ఎట్టకేలకు ఆ కుటుంబ సభ్యులంతా స్వదేశానికి పయనం అయ్యారు. మరికొద్ది క్షణాల్లో సొంత గడ్డపై కాలుమోపబోతు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా కాలంలో పరాయి దేశంలో బిక్కుబిక్కుమంటూ బతికింది ఓ కుటుంబం. సుమారు ఐదు నెలల తర్వాత ఎట్టకేలకు ఆ కుటుంబ సభ్యులంతా స్వదేశానికి పయనం అయ్యారు. మరికొద్ది క్షణాల్లో సొంత గడ్డపై కాలుమోపబోతున్నామనే సంతోషంతో వారి మనసు ఉప్పొంగింది. ఆ సంతోషాన్ని వాళ్లు సోషల్ మీడియా ద్వారా నలుగురితో పంచుకుని ఆనంద పడ్డారు. అయితే ఊహించని ప్రమాదం ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన షరాఫు పిలాసేరి (35).. తన భార్య, కుతురితో కలసి గత కొంతకాలంగా దుబాయిలోనే ఉంటున్నాడు. కరోనా నేపథ్యంలో ఆయన తన కుటుంబంతో సహా దుబాయిలో చిక్కుకుపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన స్వదేశానికి రావడానికి చాలా ప్రయత్నించాడు. ఎట్టకేలకు ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 737 ఐఎక్స్ 1344 విమానంలో ఆయన తన కుటుంబంతో కలిసి స్వదేశానికి బయల్దేరాడు. కాగా.. ఈ విమానం కేరళలోని విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురై.. దాదాపు 20 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ విమాన ప్రమాదంలో షరాఫు పిలాసేరి కూడా ప్రాణాలు కోల్పోయాడు. షరాఫు పిలాసేరి భార్య స్వల్పంగా గాయపడగా.. ఆయన కూతురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే విమానం ల్యాండింగ్‌కు ముందు షరాఫు పిలాసేరి ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్.. ప్రస్తుతం వైరల్ అవుతోంది. కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూ.. ‘బ్యాక్ టూ హోం’ అంటూ.. షరాఫు పిలాసేరి పెట్టిన పోస్ట్‌పట్ల స్పందిస్తున్న నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2020-08-08T22:06:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising