ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైత్‌లో కొత్తగా నమోదైన 77 కేసుల్లో.. 60 మంది భారతీయులే..

ABN, First Publish Date - 2020-04-06T15:36:58+05:30

కువైత్‌లో గడిచిన 24 గంటల్లో 77 కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటి: కువైత్‌లో గడిచిన 24 గంటల్లో 77 కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటించింది. ఈ 77 మందిలో 58 మంది భారతీయులేనని ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అబ్దుల్లా అల్ సనద్ వెల్లడించారు. 77 మందిలో 74 మందికి కరోనా పాజిటివ్ వారి నుంచే వైరస్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. ఒక కువైత్ దేశస్థుడికి ఫ్రాన్స్ వెళ్లిన కారణంగా వైరస్ వచ్చినట్టు పేర్కొన్నారు. మరో ఇద్దరికి వైరస్ ఎలా సోకిందనేది తెలియడం లేదన్నారు.


కాగా.. భారతీయులు కాకుండా కరోనా సోకిన వారిలో ఎనిమిది మంది పాకిస్థాన్, ముగ్గురు బంగ్లాదేశ్, ఇద్దరు ఈజిప్ట్, ఒకరు ఇరాన్‌కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. కాగా.. కువైత్ వ్యాప్తంగా ఇప్పటివరకు 556 కేసులు నమోదవగా.. 456 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 99 మంది పూర్తిగా కోలుకున్నారని, ఐసీయూలో 17 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. మరోపక్క కరోనా బాడిన పడి ఒక భారతీయుడు కువైత్‌లో శనివారం మరణించాడు. కువైత్‌లో నమోదైన మొదటి కరోనా మరణం భారతీయుడిదే కావడం గమనార్హం.

Updated Date - 2020-04-06T15:36:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising