ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీసాల గడువు విషయంలో కువైట్ కీలక నిర్ణయం..!

ABN, First Publish Date - 2020-05-25T19:54:46+05:30

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలతో వీసాల గడువు ముగుస్తున్న వారికి శుభవార్త చెప్పింది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు కొనసాగుతున్న క్రమంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైట్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలతో వీసాల గడువు ముగుస్తున్న వారికి శుభవార్త చెప్పింది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు కొనసాగుతున్న క్రమంలో.. అన్ని రకాల వీసాల గడువును మరో మూడు నెలలపాటు పొడగిస్తున్నట్టు ప్రకటించింది. కాగా.. కరోనా కారణంగా ప్రపంచం మొత్తం స్వీయ నిర్భంధంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు అమలులో ఉండటంతో ఇతర దేశాల పౌరులు కువైట్‌లో చిక్కుకుపోయారు. వీసాల గడువు ముగిసినా అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మార్చిలో అన్ని రకాల వీసాల గడువును మే చివరి వరకు కువైట్ ప్రభుత్వం పొడిగించింది. పొడగించిన గడువు ఈ నెల ముగుస్తుండటం.. అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇంకా మొదలు కాకపోవడంతో కువైట్ ప్రభుత్వం అన్ని రకాల వీసాల గడువును ఆగస్టు 31 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇందుకోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించింది.  


Updated Date - 2020-05-25T19:54:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising