ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనది తెలుగు భాష, తెలుగు జాతి: కోమటి జయరాం

ABN, First Publish Date - 2020-08-30T19:20:49+05:30

సంస్కృతంతో మిళితమై గ్రాంథికంగా ఉండిపోయిన తెలుగును మదించి వ్యావహారిక భాషలోకి సరళీకరించి ప్రతి బుజ్జాయికి జన్మత: అమ్మ జోల పాటతోనే చక్కటి తెలుగుపై మోజు పెరిగేలా తిరగరాసిన గిడుగు రామ్మూర్తి జయంతి ఆగస్టు 29ని మనం “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్నాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంస్కృతంతో మిళితమై గ్రాంథికంగా ఉండిపోయిన తెలుగును మదించి వ్యావహారిక భాషలోకి సరళీకరించి ప్రతి బుజ్జాయికి జన్మత: అమ్మ జోల పాటతోనే చక్కటి తెలుగుపై మోజు పెరిగేలా తిరగరాసిన గిడుగు రామ్మూర్తి జయంతి ఆగస్టు 29ని మనం “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్నాం. తేనెలొలుకు తెలుగుని మనకు మరింత దగ్గర చేసిన మహానుభావుడు ఆయన అని ప్రముఖ ఎన్నారై కోమటి జయరాం కొనియాడారు. మన మాతృభాష 56 అక్షరాల తెలుగు అవడం మన అదృష్టం. మనం ఎన్ని భాషలో నేర్చినా... మనలోని భావాలను యథాతథంగా కేవలం మాతృభాషలోనే చెప్పగలం. అందుకే మన పిల్లలకు మాతృభాషను నేర్పుదాం, మాతృభాషను నేర్చుకునేలా ప్రోత్సహిద్దాం అని కోమటి జయరాం పిలుపునిచ్చారు. మనం ఏదేశమేగినా తెలుగును మరువకూడదన్నారు. 


చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. నేటివ్ స్పీకర్స్ పరంగా ప్రపంచ భాషల్లో తెలుగుది 11వ స్థానం. ఇండియాలోని 6 క్లాసికల్ లాంగ్వేజస్‌లో మన తెలుగు ఒకటి, దేశంలో నాలుగో అతిపెద్ద భాష. అంతేకాదు... 19 దేశాల్లో మైనారిటీ భాషగా, అమెరికాలో వేగంగా పెరుగుతున్న భాషగా తెలుగు విస్తరిస్తోందని కోమటి జయరాం గుర్తు చేశారు. తెలుగు భాషలో రాయటం, చదవడం, మాట్లాడడం నేర్చుకొని తెలుగుతనాన్ని ముందుకు తీసుకెళదాం, తెలుగు భాష సంపదను రానున్న తరాలకు అందజేద్దాం అని ఆయన పిలుపునిచ్చారు.  ఇదిలా ఉండగా.. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో తెలుగు భాషా దినోత్సవం రోజు తెలుగు తల్లి విగ్రహానికి కనీసం పూలమాల కూడా వేయకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.  తెలుగు భాషా దినోత్సవం రోజున తెలుగు తల్లిని తెలుగు వారే అవమానించుకుంటే ఎలా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రలో ఏనాడూ ఇలా జరగలేదని అన్నారు.

Updated Date - 2020-08-30T19:20:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising