ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రెజిల్‌లో కలకలం సృష్టించిన జార్జి ఫ్లాయిడ్ తరహా ఘటన!

ABN, First Publish Date - 2020-11-21T23:45:43+05:30

బ్రెజిల్‌లో జార్జి ఫ్లాయిడ్ తరహా ఘటన చోటు చేసుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. వివరాల్లోకి వెళితే.. పోర్టో అలిగ్రే నగరంలోని క్యారీఫోర్ స్టోర్‌‌లో సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్న ఇద్దరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రెసీలియా: బ్రెజిల్‌లో జార్జి ఫ్లాయిడ్ తరహా ఘటన చోటు చేసుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. వివరాల్లోకి వెళితే.. పోర్టో అలిగ్రే నగరంలోని క్యారీఫోర్ స్టోర్‌‌లో సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్న ఇద్దరు శ్వేతజాతీయులు.. జోవో అల్బెర్టో సిల్వేరియా ఫ్రీటాస్ అనే 40 ఏళ్ల నల్లజాతి వ్యక్తిని గురువారం రోజు విచక్షణా రహితంగా కొట్టి చంపారు. సెక్యూరిటీ గార్డులలో ఒకరు జోవో అల్బెర్టో సిల్వేరియాను కాలుతో తొక్కిపట్టగా.. మరో గార్డు అతనిపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడ్డ జోవో అల్బెర్టో సిల్వేరియా.. ప్రాణాలు కోల్పోయాడు.


దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శుక్రవారం రోజు నిరసనకారులు క్యారీఫోర్ స్టోర్ వద్దకు చేరుకుని దాన్ని ధ్వంసం చేశారు. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా నిరసనకారులు జాతివివక్షతకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఇదిలా ఉంటే.. జోవో అల్బెర్టో సిల్వేరియా మృతికి కారణమైన సెక్యూరిటీ గార్డులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే జోవో అల్బెర్టో‌ సిల్వేరియాపై సెక్యూరిటీ గార్డులు దాడి చేయడానికి గల కారణాలపై స్పష్టమైన సమాచారం లేదు. కాగా.. ఈ ఏడాది మేలో అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 


Updated Date - 2020-11-21T23:45:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising