ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లైవ్‌లో వ్యాక్సిన్ తీసుకున్న కమలా హ్యారిస్..

ABN, First Publish Date - 2020-12-30T20:14:10+05:30

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ మంగళవారం లైవ్‌లో కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ మంగళవారం  లైవ్‌లో కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. వాషింగ్టన్‌లోని యునైటెడ్ మెడికల్ సెంటర్‌లో భర్త డగ్ ఎమ్హాఫ్‌తో కలిసి ఆమె మోడెర్నా టీకా మొదటి డోసు తీసుకున్నారు. ప్రజల్లో టీకాపై ఉన్న అపోహలను తొలగించి, వారిలో నమ్మకాన్ని కలిగించేందుకు ఆమె ఇలా లైవ్‌లో వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ అనంతరం కమల మాట్లాడుతూ.."కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం ఎంత ముఖ్యమో ఈ సందర్భంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మహమ్మారిపై పోరులో మనకు టీకా ఎంతో ముఖ్యం. అదే ప్రధాన అస్త్రం కూడాను. కనుక ప్రతీ అమెరికన్ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి. టీకాపై ఎలాంటి అనుమానం వద్దు. ఇది చాలా సమర్థవంతమైంది, సురక్షితమైంది. ఈ టీకాను మీరు ఉన్న ప్రాంతంలోనే మీకు పరిచయం ఉన్న వారి ద్వారానే తీసుకునే అవకాశం ఉందని తెలిపేందుకు సంతోషిస్తున్నాను. మీరు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మీ జీవితాన్ని కాపాడుకోవడంతో పాటు మీ కుటుంబ సభ్యుల జీవితాన్ని, మీ కమ్యూనిటీ జీవితాన్ని కాపాడిన వారు అవుతారు. నేను టీకా రూపొందించిన పరిశోధకులను నమ్ముతున్నాను. వారు ఎంతో శ్రమకోర్చి వ్యాక్సిన్ తయారు చేశారు. ఎన్నో పరిశోధనల అనంతరం దీనికి ఆమోదం లభించింది. కనుక టీకాపై అపోహ వద్దు. సాధ్యమైనంత వరకు అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి" అని అన్నారు. 


ఇక అగ్రరాజ్యంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా ఇప్పటికే 3.35లక్షలకు పైగా మందిని పొట్టనబెట్టుకుంది. అలాగే దేశవ్యాప్తంగా మహమ్మారి బారినపడ్డ వారి సంఖ్య రెండు కోట్లకు దగ్గరగా ఉంది. అంతేగాక ఆఫ్రో-అమెరికన్లలోనే కరోనా అత్యధిక కేసులు, మరణాలు ఉన్నట్లు గణాంకాలు చెబుతుండటం ఆందోళన కలిగించే విషయం. అలాగే వీరు వ్యాక్సిన్ తీసుకోవడం పట్ల ఆసక్తి చూపించడం లేదని సర్వే ఫలితాల్లో తేలింది. ఈ నేపథ్యంలోనే కమల.. ఆఫ్రో-అమెరికన్లు అధికంగా ఉండే వాషింగ్టన్‌లోని యునైటెడ్ మెడికల్ సెంటర్‌లో టీకా తీసుకున్నారు. వారిలో వ్యాక్సిన్‌ సమర్థత, సురక్షితతపై ఉన్న అపోహలను తొలగించేందుకే ఆమె లైవ్‌లో టీకా తీసున్నారు. కమల తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇప్పుడు అందరూ ప్రశంసిస్తున్నారు. కాగా, నవంబర్ 3న జరిగిన అమెరికా ఎన్నికల్లో కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో ఈ పదవి చేపట్టబోతున్న తొలి మహిళ, ఇండో-అమెరికన్, ఆఫ్రికన్-అమెరికన్‌గా కమల చరిత్ర సృష్టించారు.      



Updated Date - 2020-12-30T20:14:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising