ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీ చాట్‌పై ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకున్న కోర్టు

ABN, First Publish Date - 2020-09-21T08:45:47+05:30

చైనాకు చెందిన మెసేజింగ్, పేమెంట్ యాప్ వీచాట్‌ డౌన్‌లోడ్లను నిషేధించేలా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: చైనాకు చెందిన మెసేజింగ్, పేమెంట్ యాప్ వీ చాట్‌ డౌన్‌లోడ్లపై నిషేధం విధిస్తూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కోర్టు తాత్కాలికంగా అడ్డుకట్ట వేసింది. వీ చాట్‌పై నిషేధం వల్ల తాము ఎంతగానో నష్టపోతామంటూ.. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చైనాకు చెందిన కొంతమంది కోర్టులో దావా వేశారు. వీ చాట్‌ను నిషేధిస్తే కలిగే నష్టాల గురించి వారంతా ఫెడరల్ జడ్జి లారెల్ బీరల్‌కు చెప్పుకున్నారు. అమెరికాలో ఇంగ్లీషు భాషపై పూర్తి అవగాహన లేని అనేక మంది చైనీయులకు వీ చాట్ యాప్ తప్పించి మరో ప్రత్యామ్నాయం లేదని వాదులు చెప్పిన మాటలనే జడ్జి ప్రస్తావించారు. 


మరోపక్క వీ చాట్ యాప్ వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉందని చెప్పిన ప్రభుత్వం.. తగిన ఆధారాలు చూపించలేదని జడ్జి లారెన్ చెప్పారు. జాతీయ భద్రతకు ముప్పు ఉందనుకుంటే.. ఆస్ట్రేలియా ప్రభుత్వం చేసిన విధంగా ప్రభుత్వ డివైజ్‌లలో యాప్ వాడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. కాగా.. అమెరికాలోని కామర్స్ డిపార్ట్‌మెంట్ వీ చాట్ డౌన్‌లోడ్లపై ఆదివారం రాత్రి నుంచి నిషేధం విధించనున్నట్టు ప్రకటించింది. కానీ ఊహించని విధంగా కోర్టు ట్రంప్ ప్రభుత్వానికి షాకిచ్చింది. ఇప్పుడు కోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా వీ చాట్‌పై ఉన్న ఆంక్షలు నిలిచిపోనున్నాయి.

Updated Date - 2020-09-21T08:45:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising