ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూకే ఫ్రెండ్‌ను అంటూ మెసేజ్.. జర్నలిస్ట్‌కు కుచ్చుటోపి!

ABN, First Publish Date - 2020-06-18T21:47:39+05:30

సైబర్ నేరాల గురించి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే జర్నలిస్టే.. మోసపోయి లక్షలు సమర్పించుకున్న ఘటన ముంబయిలో చోటు చేసుకుంది. పోలీసులు తె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: సైబర్ నేరాల గురించి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే జర్నలిస్టే.. మోసపోయి లక్షలు సమర్పించుకున్న ఘటన ముంబయిలో చోటు చేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన 53ఏళ్ల జర్నలిస్ట్‌కు.. ఇంగ్లాండ్‌లో డాక్టర్‌గా పని చేసే ఫ్రెండ్ ఉన్నాడు. కరోనా నేపథ్యంలో తన స్నేహితుడు దేబాషిష్ బట్టాచార్య.. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం విరాళాలు సేకరిస్తున్నట్లు ముంబైకి చెందిన జర్నలిస్ట్‌ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ జర్నలిస్ట్‌కు ఒకరోజు అకస్మాత్తుగా ఓ కొత్త నెంబర్ నుంచి వాట్సప్‌లో మేసేజ్ వచ్చింది. నెంబర్ కొత్తదైనప్పటికీ.. వాట్సప్ డీపీలో తన స్నేహితుడు దేబాషిస్ బట్టాచార్య ఫొటోనే ఉండటంతో ఆ 53ఏళ్ల జర్నలిస్ట్ తిరిగి మెసేజ్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆ జర్నలిస్ట్ దాదాపు రూ.2.5లక్షలను అతనికి పంపించాడు. తీరా తాను మోసపోయినట్లు భావించిన జర్నలిస్ట్.. పోలీసులను ఆశ్రయించాడు. అయితే జర్నలిస్ట్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గుర్తు తెలియని వ్యక్తి కోసం గాలించేపనిలో పడ్డారు.


Updated Date - 2020-06-18T21:47:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising