ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతీయులకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన జో బైడెన్, కమలా హ్యారిస్

ABN, First Publish Date - 2020-10-18T07:53:51+05:30

డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్, ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ భారతీయులకు నవరాత్రి శుభాకాంక్షలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్, ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ భారతీయులకు నవరాత్రి శుభాకాంక్షలను తెలియజేశారు. ‘హిందువుల పండుగైన నవరాత్రి మొదలైంది. ఈ సందర్భంగా అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా వేడుకలు చేసుకుంటున్న వారందరికి జిల్, నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈసారి కూడా చెడుపై మంచి విజయం సాధించి కొత్త ఆనందాలు, అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాము’ అని జో బైడెన్ ట్వీట్ చేశారు. మరోపక్క కమలా హ్యారిస్ ఆమె ట్వీట్‌లో ‘హిందూ అమెరికన్ కుటుంబాలు, స్నేహితులకు నవరాత్రి శుభాకాంక్షలు. అన్ని వర్గాల వారూ కలిసి ఐకమత్యంతో సమున్నతమైన అమెరికాను నిర్మించడానికి ఈ పండుగ ప్రేరణ అవుతుందని ఆశిస్తున్నాను’ అని రాసుకొచ్చారు. కాగా.. శనివారం నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొత్తం తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు.

Updated Date - 2020-10-18T07:53:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising