ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురు నానక్ 551వ జయంతి.. సిక్కు సమాజానికి బైడెన్, కమల శుభాకాంక్షలు

ABN, First Publish Date - 2020-12-01T16:20:45+05:30

గురు నానక్ దేవ్ 551వ జయంతి సందర్భంగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్.. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కు సమాజానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: గురు నానక్ దేవ్ 551వ జయంతి సందర్భంగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్.. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కు సమాజానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిక్కు సమాజాన్ని ప్రశంసిస్తూ బైడెన్, కమల బృందం సంయుక్త ప్రకటన విడుదల చేసింది. మహమ్మారి సమయంలో ఫ్రంట్‌లైన్ కార్మికులుగా పనిచేసినందుకు సిక్కు అమెరికన్లకు కృతజ్ఞతలు తెలిపారు. "ఐదు శతాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక జ్ఞానం, మానవత్వానికి సేవ, నైతిక సమగ్రతపై గురు నానక్ బోధనల ప్రభావం చాలా ఉంది. మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో అవసరమైన కార్మికులుగా తమ పొరుగువారితో నిలబడటం, వారి గురుద్వారాలలో సమాజ వంటశాలలను తెరిచి పేదలకు ఉచితంగా భోజనం అందిస్తున్న సిక్కు అమెరికన్లందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము." అని తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక బిడెన్-కమలా ద్వయం దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చే ఏడాది పండుగను వైట్‌హౌస్‌లో వ్యక్తిగతంగా జరుపుకుందామని చెప్పిన విషయం తెలిసిందే.   

Updated Date - 2020-12-01T16:20:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising