ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జపాన్ ప్రజలకు ఫ్రీగా కరోనా టీకా..!

ABN, First Publish Date - 2020-12-03T02:11:28+05:30

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా సంస్థలు తాము అభివృద్ధి చేసిన టీకాలు మహమ్మారిని సమర్థవం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా సంస్థలు తాము అభివృద్ధి చేసిన టీకాలు మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు ప్రకటించాయి. ఆస్ట్రాజెనికా టీకా కూడా మంచి పని తీరు కనబరుస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది. అయితే ఫైజర్, మోడెర్నా సంస్థలు ఇప్పటికే ఒకడుగు ముందుకేసి అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో పలు దేశాలు తమ దేశ ప్రజలకు టీకాను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.


ఈ క్రమంలోనే జపాన్ ప్రభుత్వం.. తమ దేశ ప్రజలకు కొవిడ్ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 12.6కోట్ల మందికి కరోనా టీకాను ఉచితంగా అందించడం కోసం రూపొందించిన బిల్లుకు బుధవారం రోజు జపాన్ ఆమోదముద్ర వేసింది. కాగా.. టీకా కోసం అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా సంస్థలతో జపాన్ ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. అంతేకాకుండా 120 మిలియన్ డోసుల ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌కు కూడా ఆర్డర్ చేసింది. ఇదిలతా ఉంటే.. ఇప్పటి వరకు జపాన్‌లో 1.50లక్షల మంది కొవిడ్ బారినపడగా.. 2,100 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-12-03T02:11:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising