ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌తో పాటు మరో పది దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన జపాన్

ABN, First Publish Date - 2020-05-27T04:26:27+05:30

కరోనా నియంత్రణలో భాగంగా భారత్‌తో పాటుగా మరో పది దేశాలపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: కరోనా నియంత్రణలో భాగంగా భారత్‌తో పాటుగా మరో పది దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్టు జపాన్ ప్రధాని షింజో అబే సోమవారం వెల్లడించారు. బుధవారం నుంచి కొత్త ఆదేశాలు అమలులోకి రానున్నట్టు ఆయన చెప్పారు. ఇప్పటికే జపాన్ ప్రభుత్వం వంద దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించింది. గతంలో ట్రావెల్ బ్యాన్ విధించిన దేశాల్లో అమెరికా, చైనా, సౌత్ కొరియా, యూరప్ దేశాలు కూడా ఉన్నాయి. తాజా ఆదేశాలతో ఈ సంఖ్య 111కు చేరింది. తాజాగా భారత్‌తో పాటు ట్రావెల్ బ్యాన్ విధించిన దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్, అర్జెంటీనా, బంగ్లాదేశ్, ఎల్ శాల్వడార్, ఘనా, గ్వినియా, కిర్గిస్థాన్, పాకిస్థాన్, సౌత్ ఆఫ్రికా, తజికిస్థాన్ ఉన్నాయి. ట్రావెల్ బ్యాన్‌తో పాటుగా బోర్డర్ల వద్ద కూడా కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నట్టు షింజో తెలిపారు. జూన్ చివరి వరకు జపాన్‌లోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరిని 14 రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించనున్నట్టు చెప్పారు. కాగా.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్ ఉంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా గత రెండు నెలల నుంచి జపాన్‌ వెళ్లే అంతర్జాతీయ ప్రయాణీకుల సంఖ్య భారీగా పడిపోయింది. జపాన్‌లో ఇప్పటివరకు 16,628 కేసులు నమోదుకాగా.. కరోనా కారణంగా 851 మంది మరణించారు. కరోనా నుంచి 13,612 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.  


Updated Date - 2020-05-27T04:26:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising