ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యూజిలాండ్ ప్రధానిగా రెండోసారి.. జసిండా అర్డెర్న్ ఘన విజయం!

ABN, First Publish Date - 2020-10-17T22:06:32+05:30

న్యూజిలాండ్ ప్రధానిగా జసిండా అర్డెర్న్ రెండోసారి ఎన్నికయ్యారు. ఈ నెల 17న జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం న్యూజిలాండ్‌లో అధికారంలో ఉన్న లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. దేశ వ్యాప్తంగా 83.7

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ ప్రధానిగా జసిండా అర్డెర్న్ రెండోసారి ఎన్నికయ్యారు. ఈ నెల 17న జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం న్యూజిలాండ్‌లో అధికారంలో ఉన్న లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. దేశ వ్యాప్తంగా 83.7శాతం ఓట్లు పోలవగా.. 49శాతం ఓట్లను దక్కించుకుని ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయ ఢంకా మోగించింది. ప్రతిపక్ష నేషనల్ పార్టీ కేవలం 27శాతం ఓట్లను మాత్రమే పొంది ఘోర వైఫల్యాన్ని మూటకట్టుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జసిండా అర్డెర్న్.. తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో గెలిపించినందకు ప్రజలకు కృతజ్జతలు తెలిపారు. తదుపరి మూడు సంవత్సరాల్లో చేయాల్సిన పని చాలా ఉందని పేర్కొన్నారు. కరోనా ఏర్పరచిన ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. న్యూజిలాండ్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.


కాగా షెడ్యూల్ ప్రకారం న్యూజిలాండ్‌లో సెప్టెంబర్ 19న ఎన్నికలు జరగాలి. అయితే కరోనా మహమ్మారి రెండోసారి విజృంభించడంతో అక్టోబర్ 17కు ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రధానిగా జసిండా అర్డెర్న్‌కు ప్రజల్లో మంచి పేరుంది. ఈ క్రమంలో ఆమెను మరోసారి ప్రజలు ఎన్నుకున్నారు. 


Updated Date - 2020-10-17T22:06:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising