ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒమన్‌ విషయంలో రెండింటీలో భారతీయులే టాప్..!

ABN, First Publish Date - 2020-09-26T13:48:51+05:30

నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్(ఎన్‌సీఎస్‌ఐ) ఆఫ్ ఒమన్ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం ఆ దేశం నుంచి తిరిగి వస్తున్న వారితో పాటు అక్కడికి వెళ్తున్న వారిలో రెండింటీలో భారతీయులే టాప్‌లో ఉన్నట్లు వెల్లడైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మస్కట్: నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్(ఎన్‌సీఎస్‌ఐ) ఆఫ్ ఒమన్ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం ఆ దేశం నుంచి తిరిగి వస్తున్న వారితో పాటు అక్కడికి వెళ్తున్న వారిలో రెండింటీలో భారతీయులే టాప్‌లో ఉన్నట్లు వెల్లడైంది. ఈ డేటా ప్రకారం జూలైలో 30,718 మంది భారతీయులు ఒమన్ నుంచి స్వదేశానికి చేరుకోగా... 699 మంది భారత్ నుంచి ఒమన్ వెళ్లారు. భారతదేశం తర్వాతి స్థానంలో పాకిస్థాన్ ఉంది. 10,151 మంది పాకిస్థానీలు ఒమన్‌ను వదలగా, 163 మంది అక్కడికి వెళ్లడం జరిగింది. మూడో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ నుంచి 1,340 మంది స్వదేశానికి పయనమైతే, 22 మంది ఒమన్‌కు వెళ్లారు.


ఇక కరోనా మహమ్మారి నేపథ్యంలో ఒమన్ మార్చి 29 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశానికి రాకపోకలు సాగించే విదేశీయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయితే, భారత్ చేపట్టిన 'వందే భారత్ మిషన్' కార్యక్రమం కింద ఎయిరిండియా విమానాలు రాకపోకలు సాగించడంతో ఒమన్ నుంచి ఇండియాకు వచ్చిన వారితో పాటు అక్కడికి వెళ్లిన భారతీయుల సంఖ్య పెరిగింది. కాగా, అక్టోబర్ 1 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభిస్తున్నట్లు గురువారం ఒమన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  

Updated Date - 2020-09-26T13:48:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising