ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు చేసుకున్న భారతీయులు!

ABN, First Publish Date - 2020-08-16T00:48:05+05:30

74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు ఘనంగా జరుపుకున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ.. మాస్క్ ధరించి సంబరాలు చేసుకున్నారు. జాతీయ గీతాన్ని, దేశభక్తి పాటలు పాడా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు ఘనంగా జరుపుకున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ.. మాస్క్ ధరించి సంబరాలు చేసుకున్నారు. జాతీయ గీతాన్ని, దేశభక్తి పాటలు పాడారు. బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో రాయబారి విక్రమ్ మిస్రీ.. జాతీయ జెండాను ఆవిష్కరించి, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సందేశాన్ని చదివి వినిపించారు. కరోనా నేపథ్యంలో బ్రిటన్‌లోని భారత రాయబార కార్యాలయం.. అతికొద్ది మందితో.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను నిర్వహించింది. అంతేకాకుండా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను సోషల్ మీడియాలోని అధికారిక పేజీలలో ప్రత్యక్ష ప్రసారం చేసింది. సింగపూర్‌లోని భారతీయులు ఫేస్‌బుక్ లైవ్ ద్వారా భారత హైకమిషనర్‌ హోదా కలిగిన పీ కుమారన్‌కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సింగపూర్‌లోని భారతీయ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు.. ఆన్‌లైన్‌లో స్వాతంత్ర్య  దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి సంజీవ్ సింగ్లా.. రాయబార కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ సందేశాన్ని ఆయన చదివి వినిపించారు. 


Updated Date - 2020-08-16T00:48:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising