ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జో బైడెన్‌కు మద్దతుగా వీడియోను విడుదల చేసిన భారతీయ దంపతులు!

ABN, First Publish Date - 2020-08-22T23:04:38+05:30

అమెరికాలో అధ్యక్ష పదవికి నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్-అమెరికన్ల ఓటర్లపై రెండు ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి. ఇందులో భాగంగా ఇండియన్-అమెరికన్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్:  అమెరికాలో అధ్యక్ష పదవికి నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్-అమెరికన్ల ఓటర్లపై రెండు ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి. ఇందులో భాగంగా  ఇండియన్-అమెరికన్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిలికాన్ వ్యాలీలో నివసిస్తున్న భారత్‌కు చెందిన దంపతులు జో బైడెన్‌కు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు.


వీడియోలోని దృశ్యాల ప్రకారం.. బ్యాక్ గ్రౌండ్‌లో మ్యూజిక్ వస్తుండగా.. భారత్, అమెరికా జాతీయ జెండాలతో ఈ వీడియో ప్రారంభం అవుతుంది. అనంతరం భారత్‌కు చెందిన దంపతులు వినితా, అజయ్ జియాన్ భుటోరియా మాట్లాడుతూ.. నవంబర్ 3న జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీని గెలిపించాలని ఇండియన్-అమెరికన్ ఓటర్లకు పిలుపునివ్వడం కనిపిస్తుంది. ‘అమెరికా కా నేతా కైసా హో.. జో బైడెన్ జైసా హో’ అంటూ వినితా, అజయ్ జియాన్ భుటోరియా దంపతులు ఈ వీడియోలో నినదించారు. అనంతరం వివిధ రకాల కమ్యూనిటీలకు చెందిన ఇండియన్-అమెరికన్లు వారి మద్దతును జో బైడెన్, కమలా హారిస్‌కు ఇవ్వడం ఈ వీడియోలో చూడవచ్చు.


కాగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. జో బైడెన్‌కు మద్దతుగా మరో రెండు ప్రచార వీడియోలోను రూపొందించి, సోషల్ మీడియాలో విడుదల చేయనున్నట్లు వినితా, అజయ్ జియాన్ భుటోరియా దంపతులు తెలిపారు. 


Updated Date - 2020-08-22T23:04:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising